BigTV English

Kerala Story Director :’శిక్ష వేస్తున్నట్టుగా ఉంది’.. కేరళ స్టోరీ దర్శకుడి వ్యాఖ్యలు

Kerala Story Director :’శిక్ష వేస్తున్నట్టుగా ఉంది’.. కేరళ స్టోరీ దర్శకుడి వ్యాఖ్యలు


Kerala Story Director : కొన్ని సినిమాలు ఎంటర్‌టైన్మెంట్ అందించడంతో పాటు ప్రేక్షకులకు ఏదో ఒక మెసేజ్‌ను కూడా అందిస్తాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులకు తెలియని చేదు నిజాలను వారి ముందు పెడతాయి. సాధారణంగా ఇలాంటి సినిమాలు అనేక విమర్శలను ఎదుర్కుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఇటీవల విడుదలయిన ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమా హిట్ అయినా కూడా తమకు కష్టాలు తప్పడం లేదని తాజాగా దర్శకుడు ఓ ప్రెస్ మీట్‌లో బయటపెట్టాడు.

‘ది కేరళ స్టోరీ’ చిత్రం కేరళలోని హిందూ అమ్మాయిల గురించి, బలవంతమైన మత మార్పిడి గురించి తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలయిన తర్వాత ఇది నిజమే అని ఒప్పుకోవడానికి పలువురు అమ్మాయిలు ముందుకొచ్చారు. అంతే కాకుండా ఇది క్రియేట్ చేసిన కాంట్రవర్సీ వల్ల మూవీ టీమ్ ఇబ్బందులు కూడా ఎదుర్కున్నారు. అయినా అన్ని విమర్శలను, కాంట్రవర్సీలను దాటి ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సూపర్‌హిట్‌గా నిలిచింది. కానీ విడుదలయ్యి ఇన్ని రోజులయినా కేరళ స్టోరీకి ఓటీటీ ఆఫర్లు రావడం లేదు.


ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఏవీ కేరళ స్టోరీ చిత్రాన్ని కొనడానికి ముందుకు రావడం లేదని సినీ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి దర్శకుడు సుదీప్తో సేన్ స్పందించాడు. ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది అనే ప్రశ్నకు తాను సమాధానం ఇచ్చాడు. అదంతా అబద్ధం అని తేల్చాశాడు. ఇప్పటికీ కేరళ స్టోరీకి ఓటీటీ ఆఫర్లు రాలేదని బయటపెట్టాడు. ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుండి మంచి డీల్ వస్తుందో అని ఇంకా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఆఫర్లు ఏమీ రాలేదని అన్నాడు.

కేరళ స్టోరీకి ఓటీటీ ఆఫర్లు రాకపోవడం చూసి సినీ పరిశ్రమ అంతా కలిసి శిక్ష వేసినట్టుగా అనిపిస్తుందని సుదీప్తో వాపోయాడు. మా సినిమా సక్సెస్‌ను కూడా ఇండస్ట్రీలో కొందరు శిక్ష వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నాడు. సుదీప్తో వ్యాఖ్యలకు పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా పరోక్షంగా స్పందించాయి. ఈ సినిమాను కొని, స్ట్రీమ్ చేసి తాము రాజకీయ చిక్కుల్లో ఇరుక్కోదలచుకోలేదని అంటున్నాయి. కానీ దర్శకుడు మాటలు వింటుంటే ఎవరో కావాలనే ఈ రిలీజ్‌ను ఆపేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. మరి కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×