Forbes India 30 Under 30: అమెరికాకు చెందిన ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రతి ఏడాది అత్యంత ప్రజాదారణ పొందిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా 2025 కు గానూ 30 సంవత్సరాల లోపు అత్యంత ప్రజాదారణ కలిగిన 30 మంది సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో తమన్నా(Tamannaah ), నయనతార (Nayanthara), సాయి పల్లవి (Sai Pallavi) వంటి వారిని కూడా వెనక్కి నెట్టుతూ ఒక హీరోయిన్ పేరు దక్కించుకోవడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఇది 30 ఏళ్లలోపు వారి పేర్లు మాత్రమే తీయడంతో.. అటు రష్మిక మందన్న (Rashmika mandanna) పేరు లేకపోవడం వల్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు
ఫోర్బ్స్ జాబితాలో స్టార్ హీరోయిన్స్ ని వెనక్కి నెట్టిన హీరోయిన్..
తాజాగా ఫోర్బ్స్ అండర్ 30 జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేయగా.. అందులో ప్రముఖ కోలీవుడ్ నటి అపర్ణ బాలమురళి(Aparna balamurali) చోటు దక్కించుకుంది. ఈమెతో పాటు బాలీవుడ్ నటుడు రోహిత్ శరత్ (Rohith Sarath) కూడా ఈ విభాగంలో స్థానం దక్కించుకోవడం గమనార్హం. ముఖ్యంగా గత ఏడాది వీరిద్దరూ కూడా అత్యంత ప్రజాదారణ పొందిన సెలబ్రిటీలుగా పేరు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి స్థానం లభించింది.గత సంవత్సరం అపర్ణ బాలమురళి తమిళంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush ) హీరోగా నటించిన ‘రాయన్’ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో అపర్ణ బాలమురళి పేరు మారుమ్రోగిపోయింది. అలాగే మలయాళం లో ‘కిష్కింధ కాండం’, ‘రుద్రం’ వంటి చిత్రాలలో కూడా తనదైన శైలిలో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు ఈ ఫోర్బ్స్ జాబితాలో 29వ స్థానం లభించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ అందరినీ వెనక్కి నెట్టి అపర్ణ బాలమురళి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది అని ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం.
అపర్ణ బాలమురళి సినిమా కెరియర్..
అపర్ణ బాలమురళి సినిమా జీవిత విశేషానికి వస్తే.. 2013లో విడుదలైన మలయాళం చిత్రం ‘యాత్ర తుదరున్ను’ సినిమాతో నటిగా అడుగుపెట్టి, ఆ తర్వాత తమిళ్, తెలుగు సినిమాలలో నటించింది. ఆ తరవాత 2016లో మలయాళంలో విడుదలైన ‘మహేషింటే ప్రతికారం’ అనే చిత్రంతో మంచి పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత కోలీవుడ్లో ‘ఎట్టు తోట్టాక్కల్’, ‘సర్వం థాల మాయం’ వంటి చిత్రాలలో నటించింది. ఇక 2020లో సుధా కొంగర దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ఆకాశమే నీ హద్దు (సూరారై పోట్రు) సినిమాలో సూర్య సరసన నటించి.. తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది. 2022లో ఆకాశం అనే సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు ఎక్కువగా తమిళ్, మలయాళం సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక అపర్ణ బాలమురళి విషయానికి వస్తే.. 1995 సెప్టెంబర్ 11న త్రిస్సూర్ లో జన్మించింది. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పాలక్కాడ్ లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఈమె నటిగానే కాదు గాయనిగా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు శాస్త్రీయ నృత్యకారిణి కూడా.