BigTV English

Richest Actor in India: ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్స్.. టాప్‌ 10లో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు..

Richest Actor in India: ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్స్.. టాప్‌ 10లో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు..

Richest Actor in India: ఇండియాలో ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్న, ఇప్పటికే ఎక్కువ సంపద ఉన్న నటుల లిస్ట్‌ను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. IMDB డేటాను ఆధారంగా చేసుకుని టాప్ 10లో ఉన్న అత్యధిక పెయిడ్ ఇండియన్ నటుల లిస్ట్‌ను తయారు చేసింది. అందులో టాప్ వన్‌లో ఎవరు ఉన్నారో తెలుసుకుందాం.


షారుఖ్ ఖాన్: ఫోర్బ్స్ రిలీజ్ చేసిన జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇండియాలో అత్యధిక సంపద ఉన్న నటుల్లో షారుఖ్ ఖాన్ మొదట్లో ఉన్నాడు. షారుఖ్ సంపద సుమారు రూ.6300 కోట్లు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే స్టార్ కూడా ఆయనే కావడం విశేషం. షారుఖ్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు తీసుకుంటాడు. ఇక ఆయన సంపదలో ఇతర నటులెవరూ దరదాపుల్లో లేరు.

సల్మాన్ ఖాన్: పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో సినీ ప్రియుల్ని ఎంతగానో అలరించే నటుడు సల్మాన్ ఖాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ సంపద రూ.2900 కోట్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. గత ముప్పై ఏళ్లుగా బాలీవుడ్‌ను ఈ నటుడు ఏలుతున్నాడు.


Also Read:  పురాణాలు అన్నింటికి కల్కి క్లైమాక్స్.. కథ మొత్తం చెప్పేసిన నాగ్ అశ్విన్

అక్షయ్ కుమార్: ఇక మూడో ప్లేస్‌లోనూ బాలీవుడ్ నటుడే ఉండటం గమనార్హం. స్టార్ హీరో అక్షయ్ కుమార్ రూ.2500 కోట్ల సంపదతో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. కాగా ఈ యాక్టర్ పలు సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

అమీర్ ఖాన్: నాలుగో స్థానంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఉన్నాడు. ఆయన సంపద సుమారు రూ.1862 కోట్లు. కాగా దంగల్ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఘనత అతడికే దక్కుతుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు.

దళపతి విజయ్: కోలీవుడ్ యాక్టర్ దళపతి విజయ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయనకు తెలుగులోనూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ నటుడు రూ.474 కోట్ల సంపదతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక తన కెరీర్‌లో చివరి చిత్రం ఇప్పుడు తీస్తున్నాడు. దీని తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయలలో యాక్టివ్‌గా ఉండనున్నాడు.

రజనీకాంత్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.430 కోట్ల సంపదతో ఆరో ప్లేస్‌లో ఉన్నాడు. గతేడాది జైలర్ సినిమాతో రజనీకాంత్ దాదాపు రూ.110 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

Also Read: ఇప్పటి వరకు ‘దేవర’ ఫియర్ చూశారు.. ఇప్పుడు రొమాన్స్ చూస్తారు.. సెకండ్ సాంగ్ రెడీ..!

అల్లు అర్జున్: ఐకాన్ స్టార్‌గా సినీ ప్రియుల గుండెల్లో నిలిచిపోయాడు అల్లు అర్జున్. ఈ హీరో రూ.350 కోట్ల సంపదతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు పుష్ప2తో సత్తా చాటబోతున్న ఐకాన్ స్టార్ తన సంపదను మరింత పెంచుకోబోతున్నాడు.

ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సంపదను ఫోర్బ్స్ సుమారు రూ.241 కోట్లుగా అంచనా వేసింది. త్వరలోనే కల్కి 2898 ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే తన సంపద మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×