BigTV English

Devara Second Song Update: ఇప్పటి వరకు ‘దేవర’ ఫియర్ చూశారు.. ఇప్పుడు రొమాన్స్ చూస్తారు.. సెకండ్ సాంగ్ రెడీ..!

Devara Second Song Update: ఇప్పటి వరకు ‘దేవర’ ఫియర్ చూశారు.. ఇప్పుడు రొమాన్స్ చూస్తారు.. సెకండ్ సాంగ్ రెడీ..!

Devara Second Song Update: ఈ ఏడాది బడా హీరోల సినిమాల జాతర మామూలుగా ఉండదు. థియేటర్లు సందడి సందడిగా ఉండనున్నాయి. అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఒకటి. ఈ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. క్రియేటివ్ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఓ రేంజ్‌లో రూపొందిస్తున్నాడు. భారీ హంగులతో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.


ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఒకెత్తయితే.. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ మరో ఎత్తనే చెప్పాలి. ‘ఫియర్ సాంగ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఊహకందని వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఆ సాంగ్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్, యాక్షన్ సీన్స్ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ అందించిన ఈ సాంగ్‌కి సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారనే చెప్పాలి.

Also Read: దేవర ఈసారి ముందే వస్తున్నాడు.. ఇక పూనకాలే


కాగా ఈ చిత్రాన్ని మొదటిగా ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకు అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ మార్చారు. అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఒక నెల ముందుగా అంటే సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ కూడా వదిలారు.

ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా అప్డేట్లు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ మూవీలోని సెకండ్ సాంగ్‌ను ఆడియన్స్‌కు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి సాంగ్‌లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించిన ఎన్టీఆర్.. ఈ సారి సెకండ్ సాంగ్‌లో రొమాంటిక్ యాంగిల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీకపూర్ మధ్య సాగే ఒక రొమాంటిక్ సాంగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×