Chhaavva :రష్మిక మందన్న (Rashmika mandanna).. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ పెంచేసుకుంది. దీనికి తోడు బాలీవుడ్ లో వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత బిజీగా మారిపోయింది. ఇక పుష్ప2 సినిమా తర్వాత బాలీవుడ్ లో ఈమె నటిస్తున్న చిత్రం ‘ఛావా'(Chhaavva). ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ ఛత్రపతి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శంభాజీ భార్య పాత్రలో రష్మిక నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky koushal) హీరోగా, రష్మిక మందన్న కీలక పాత్రలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. అయితే ఇందులో కొన్ని సన్నివేశాలను తొలగించాలని, మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ (Uday Samanth) అభ్యంతరం వ్యక్తం చేశారు.
ట్రైలర్ పై మహారాష్ట్ర మంత్రి అభ్యంతరం..
ముఖ్యంగా ట్రైలర్లో శంభాజీ మహారాజ్ డాన్స్ చేస్తున్నట్లు చూపించారు. దర్శకుడు వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలి. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు చరిత్రకారులకు, స్కాలర్షిప్ లకి ఈ సినిమా చూపించాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. మేము ఈ సినిమా విడుదలకు అంగీకరించలేము” అంటూ ఉదయ్ సామంత్ మీడియాతో తెలిపారు.. మీడియాతో మాట్లాడడానికి ముందు ఆయన ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ పెట్టారు. శంభాజీ మహారాజ్ జీవితాన్ని తెరపైకి తీసుకొస్తున్నందుకు చిత్ర బృందాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని తక్కువ చేస్తే మాత్రం మేము సహించము అంటూ ఆయన తెలిపారు.ఇక తన పోస్టులో కూడా ఇలాగే రాసుకువచ్చారు. “ఛత్రపతి శంభాజీ జీవిత కథను ఆధారంగా చేసుకొని హిందీలో సినిమా సిద్ధం కావడంతో ఎంతో ఆనందిస్తున్నాము. ముఖ్యంగా ఛత్రపతి చరిత్ర గురించి ప్రపంచానికి తెలియజేసేలా చిత్రాలు రూపొందించాలి. ఇక ఈ సినిమాలోని పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శంభాజీ మహారాజ్ యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసేలా ఏవైనా ఉంటే మాత్రం వెంటనే దర్శక నిర్మాతలు స్పందించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలి. లేకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటాము” అంటూ ఆయన తెలిపారు.
రష్మీకకు కొత్త ఏడాది కొత్త చిక్కులు మొదలు..
ఇకపోతే ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేయగా.. ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ , రష్మిక నటనకు సినీ ప్రియులు సైతం ముగ్ధులు అవుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులో భాగం కావడం నిజంగా తన అదృష్టమని, అటు రష్మిక కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఏది ఏమైనా రష్మికకు ఈ కొత్త ఏడాది కొత్త మూవీకి చిక్కులు ఏర్పడడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుండి రష్మిక పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేయగా ఇందులో ఆమె తన అద్భుతమైన లుక్కుతో అందరిని ఆకట్టుకుంది.