BigTV English

IRCTC Tatkal: రైల్వేమంత్రితో టికెట్ బుక్ చేయించాలి, తత్కాల్ ఇబ్బందులపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

IRCTC Tatkal: రైల్వేమంత్రితో టికెట్ బుక్ చేయించాలి, తత్కాల్ ఇబ్బందులపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

IRCTC Tatkal Booking: రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియ అనేది చాలా కఠినమైనదిగా చాలా మంది భావిస్తుంటారు. ఇక తత్కాల్ టికెట్ల బుకింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. తత్కాల్ టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు నిప్పులు చెరుగుతున్నారు.


రైల్వేమంత్రి చేత తత్కాల్ టికెట్ బుక్ చేయించాలి!

తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రవి సుతాంజని అనే యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేమంత్రి చేత ఒక్కసారైనా IRCTC వెబ్‌ సైట్ ద్వారా తత్కాల్ టిక్కెట్లను  బుక్ చేయించాలన్నారు. అప్పుడు ప్రయాణీకులు పడుతున్న బాధలేంటో తెలుస్తాయన్నారు. అప్పటికైనా ఆయన ఈ ఇబ్బందులను తొలగించేలా ఏవైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలని ట్వీట్ చేశారు. “ రైల్వేమంత్రి ఒకసారి IRCTCలో తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నించాలని కోరుతున్నాను. ఆ వెబ్‌ సైట్/యాప్ ఉదయం 10 గంటలకు పనిచేయదు. కష్టపడి లాగిన్ అయ్యే సమయానికి చాలా టికెట్లు అయిపోతాయి. ఈ సమస్యను గత దశాబ్ద కాలంగా పరిష్కరించకపోవడం బాధాకరం” అని రాసుకొచ్చారు. ఆయనకు మద్దతుగా చాలా మంది తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎదురైన సవాళ్లను పంచుకుంటున్నారు.


IRCTCకి మద్దుగా మరికొంత మంది ట్వీట్స్

ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందికి IRCTCని నిందించడం ఎందుకని మరికొంత మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో సైట్ క్రాష్ కాకుండా ఏమవుతుందంటున్నారు భవిన్ రాథోడ్. IRCTCని Zomato, Ola, Uberతో పోల్చకూడదంటున్నారు. జొమాటో యాప్ ప్రతి రోజు మిలియన్ ఆర్డర్లను తీసుకుంటుందన్న రవి.. పీక్ అవర్స్, పండుగల సమయంలో ఇంకా ఎక్కువగా ఉంటున్నా ఎందుకు ఆ సైట్ క్రాష్ కావట్లేదని ప్రశ్నించారు. దానికి భవిన్ మళ్లీ స్పందించారు. అక్కడ ఎన్ని ఆర్డర్స్ పెట్టినా వాళ్లు యాక్సెప్ట్ చేస్తారని.. తత్కాల్ టికెట్ల విషయంలో అలా కాదన్నారు. ఇక్కడ లిమిట్ అనేది ఉంటుందన్నారు.

Read Also: పర్వత గర్భంలో నుంచి వెళ్లే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. దాన్ని దాటేందుకు ఎంత టైమ్ పడుతుందంటే?

టికెట్ బుకింగ్ ఏజెంట్లే కారణమా?               

IRCTC ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయడంలో టికెట్ బుకింగ్ ఏజెట్లు తప్పుడు పద్దతులు ఉపయోగిస్తున్నారని, వారి మూలంగానే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ముందుగా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుని, ఆ తర్వాత ఎక్కవ ధరకు వాటిని అమ్ముతున్నారని ఆరోపించారు. ఒక్కొ టికెట్ మీద రూ. 400 నుంచి రూ. 500 వరకు వసూళు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో తరచుగా సైట్ క్రాష్ కావడం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కుతున్నారు. అయితే, పరిమిత టికెట్లకు ఎక్కువ మంది పోటీపడటం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని గతంలో రైల్వేశాఖ వెల్లడించింది.

Read Also: ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్‌ పరుగులు..ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×