BigTV English
Advertisement

Bollywood Actors Expensive Homes : బీ టౌన్ హీరోల మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇళ్ళు… ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Bollywood Actors Expensive Homes : బీ టౌన్ హీరోల మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇళ్ళు… ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే

Bollywood Actors Expensive Homes : సెలబ్రిటీలు, తల పర్సనల్ లైఫ్ ఆసక్తికరంగా ఉంటాయి. వాళ్ళు పెట్టుకునే వాచ్ దగ్గర నుంచి మొదలు పెడితే, కట్టుకునే ఇంటి వరకు అన్నీ కాస్ట్లీ గా ఉంటాయి. అలా బాలీవుడ్ లో ఉన్న ఉన్న టాప్ 7 సెలెబ్రెటీల ఇళ్ళు, వాటి ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరాగాల్సిందే.


షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) – మన్నత్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బంగ్లా ‘మన్నత్’ అత్యంత ఖరీదైన బాలీవుడ్ స్టార్ల ఇళ్ళలో ఒకటి. సమాచారం ప్రకారం ‘మన్నత్’ ఇంటి విలువ రూ. 200 కోట్లు. ఈ బంగ్లాను ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్, షారుఖ్ భార్య అయిన గౌరీ ఖాన్ తన అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఈ ఇల్లు 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, ఇందులోనే షారుఖ్ తన భార్య, ముగ్గురు పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్‌లతో కలిసి నివసిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ (Salman Khan) – అర్పితా ఫామ్స్
సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్‌హౌస్ ను 150 ఎకరాల్లో నిర్మించారు. దీని విలువ రూ. 150 కోట్లు. ఈ ఇంటిని సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పిత పేరు మీద రాశారు. అందుకే ఫామ్ హౌస్ కు అర్పితా ఫామ్స్ అనే పేరు పెట్టారు. ఇందులో మొత్తం మూడు బంగ్లాలు ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ఫామ్ హౌస్ చుట్టూ పచ్చదనంతో, ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.


అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) – జల్సా
ఆ తరువాత చెప్పుకోవాల్సింది బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హౌస్ ‘జల్సా’ గురించి. ‘సత్తే పే సత్తా’ (1982) విజయం సాధించిన తర్వాత నిర్మాత ఎన్‌సి సిప్పీ ఈ బంగ్లాను బిగ్ బికి బహుమతిగా ఇచ్చాడు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు ‘జల్సా’ ఖరీదు రూ.120 కోట్లకు పైగా ఉంటుంది. జుహులోని మారియట్ సమీపంలో ఉన్న ఈ భవనంలోనే అమితాబ్ బచ్చన్, అతని భార్య జయ, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యలతో కలిసి ఉంటారు.

శిల్పాశెట్టి (Shilpa Shetty) – కినార
శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా బీచ్ హౌజ్ ధర రూ. 100 కోట్లు. దానికి శిల్పా శెట్టి దంపతులు ‘కినారా’ అనే పేరు పెట్టుకున్నారు.

హృతిక్ రోషన్ (Hrithik Roshan) పెంట్ హౌస్
గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14, 15, 16వ అంతస్తులతో సహా మూడు అంతస్తులతో కూడిన పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌ని కొన్నాడు. అంధేరి నడిబొడ్డున ఉన్న ఈ ట్రిప్లెక్స్ ధర రూ. 100 కోట్లకు పైగా ఉంటుంది.

అజయ్ దేవగన్ (Ajay Devgan) – శివశక్తి
స్టార్ కపుల్ కాజోల్, అజయ్ దేవగన్ లగ్జరీ హౌస్ 5,310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. జుహులో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటి ధర రూ. 60 కోట్లు. దీనికి శివశక్తి అని పేరు పెట్టుకున్నారు.

దీపికా పదుకొణె (Deepika Padukone), రణ్‌వీర్‌ సింగ్‌ 
బాంద్రా నడిబొడ్డున సాగర్ రేషం బిల్డింగ్‌లో 16, 17, 18, 19వ అంతస్తులను కొన్నారు దీపికా దంపతులు. 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ల రూ. 119 కోట్ల విలువ ఉంటుందని తెలుస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×