BigTV English

Allu Arjun – Nayanthara: పాపం బన్నీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీమ్స్ తో ట్రోల్స్..?

Allu Arjun – Nayanthara: పాపం బన్నీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మీమ్స్ తో ట్రోల్స్..?

Allu Arjun – Nayanthara : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రియల్ గా జరిగే కొన్ని సన్నివేశాలను, సినిమాలలో కూడా పెట్టి వాటిని బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల వల్ల మీమర్స్ కి , ట్రోలర్స్ కి మంచి స్టఫ్ దొరికినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఒక అవార్డు ఫంక్షన్ ఈవెంట్లో నయనతార (Nayanthara ), అల్లు అర్జున్ (Allu Arjun) కి చేసిన అన్యాయం అప్పుడు బాగా వైరల్ అయింది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వచ్చిన ఒక సన్నివేశం చూసి.. గతంలో జరిగిన విషయాన్ని ,ఆ వీడియోను వైరల్ చేస్తూ.. అందరూ ఈ విషయాన్ని తెగ ట్రోల్ చేస్తూ.. పాపం బన్నీ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


పాపం బన్నీ..

ఇటీవల అనిల్ రావిపూడి (Anil Ravipudi), విక్టరీ వెంకటేష్ (Venkatesh) కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రాంతీయ చిత్రంగా విడుదలైనప్పటికీ దాదాపు రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇందులో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మొదలైన అరగంట తర్వాత ఒక సన్నివేశం వస్తుంది. అందులో ఐశ్వర్య రాజేష్ (భాగ్యం) తన క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఒకటి పెట్టారు. ఇక ఆ ఊరి ఎమ్మెల్యేగా శ్రీకాంత్ అయ్యంగార్ ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తారు. భాగ్యం పెర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే చేతులు మీదుగా ఆమెకు శాలువాతో పాటు షీల్డ్ కూడా బహుకరించాల్సి ఉంటుంది. ఆ ఊరి ఎమ్మెల్యే ఎంతో ఉత్సాహంగా ఆమెకు శాలువా వేయాలని అనుకుంటాడు. అంతలోనే భాగ్యం మా బావతో ఈ శాలువా వేయించుకోవాలనుకుంటున్నాను అంటూ వెంకటేష్ చేత దానిని తీసుకుంటుంది l. అలాగే షీల్డ్ కూడా వెంకటేష్ చేతే ఇప్పించుకుంటుంది. అప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ హార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.


ALSO READ:Samantha: సమంతపై కోలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్.. ఊహించలేదు అంటూ..!

వెంకటేష్ మూవీ తో ట్రోల్స్ వైరల్..

ఇక ఈ సన్నివేశంలో ఎమ్మెల్యే ఎంత హర్ట్ అయ్యారో.. గతంలో నయనతార చేసిన పనికి అల్లు అర్జున్ కూడా అంతే హర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇలాంటి సన్నివేశం గతంలో ఒక అవార్డు ఫంక్షన్లో అల్లు అర్జున్, నయనతార మధ్య జరిగినట్టు తెలుస్తోంది. అవార్డు ఫంక్షన్లో భాగంగా నయనతారకు అవార్డు వస్తే.. ఆ అవార్డును అల్లు అర్జున్ తన చేతుల మీదుగా ఇవ్వాలని అక్కడున్న హోస్ట్ సూచిస్తారు. కానీ నయనతార అల్లు అర్జున్ చేతుల మీద కాకుండా తన భర్త విఘ్నేష్ శివన్ (Vighnesh shivan) చేతుల మీదుగా అవార్డును తీసుకుంటుంది. దీంతో అక్కడ అల్లు అర్జున్ కాస్త హర్ట్ అయినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు ఆ వీడియోని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ఈ సన్నివేశాన్ని జతచేస్తూ పాపం అల్లు అర్జున్ నయనతార ఎంత మోసం చేసింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికైతే బన్నీ ఇక్కడ వెర్రి వెంగళప్ప అయ్యాడు అని మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా.. నయనతార- అల్లు అర్జున్ మధ్య జరిగిన ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని.. ఇలాంటి సన్నివేశాన్ని అనిల్ రీ క్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ రెండు సన్నివేశాలు బాగా సింక్ అవ్వడంతో వీటిని బాగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. మరి దీనిపై అనిల్ రావిపూడి ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×