Kannappa Event : తెలుగు సినీ పరిశ్రమ సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. గత 14 సంవత్సరాలుగా గద్దర్ ఫిలిం అవార్డ్స్ కోసం సినీ పెద్దలు ఎంతగా ఆరాట పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ అవార్డ్స్ కోసం ఎంతోమంది సినీ పెద్దలు ప్రభుత్వాలు చుట్టూ తిరుగుతూ.. ఎట్టకేలకు ఆ సందర్భాన్ని తీసుకొచ్చారనే చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రోత్సాహంతో ఎఫ్ డీ సీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) తన కమిటీ సభ్యులతో కలిసి గద్దర్ అవార్డ్స్ (Gaddar Film Awards)కు అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగింది.
అలా అర్హులైన వారికి ఈరోజు హైదరాబాద్ హైటెక్స్ వేదికగా సినీ, రాజకీయ పెద్దల సమక్షంలో గద్దర్ అవార్డ్స్ ను అందజేయనున్నారు. ఇకపోతే ఇక్కడ టాలీవుడ్ పరిశ్రమ మొత్తం ఒకే వేదికపై సందడి చేస్తుంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేళ.. కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
‘మా’ అధ్యక్షుడు సినీ పరిశ్రమలో కష్టాలు వస్తే స్పందించడమే కాదు సినీ పరిశ్రమ సంతోషాలను కూడా పంచుకోవడంలో ముందు ఉండాలి. అయితే ఈయన మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప (Kannappa). భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohan Lal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ బాబు (Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu), శివ బాలాజీ (Siva Balaji), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది.
ఇక జూన్ 27వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా.. ఇటు తెలంగాణ హైదరాబాదులో గద్దర్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరుగుతుంటే.. దీనిని పట్టించుకోకుండా మంచు విష్ణు కేరళలోని కొచ్చిలో తన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించడంతో విమర్శలు తలెత్తుతున్నాయి.
మా ప్రెసిడెంట్ కి గద్దర్ అవార్డ్స్ అంటే లెక్క లేదా?
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఇంత పెద్ద వేడుక ఇక్కడ జరుగుతుంటే.. అదేమీ పట్టనట్టు.. తన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను పక్క రాష్ట్రంలో జరుపుతూ.. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మంచు విష్ణు?.. అసలు గద్దర్ అవార్డ్స్ అంటే మంచు విష్ణు కి లెక్క లేదా? అంటూ పలువురు నెటిజన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమ మొత్తం కలలు కన్న ఇంత పెద్ద వేడుక ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో జరుగుతుంటే.. మంచు విష్ణు మాత్రం అదేమీ పట్టనట్టు తన సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పక్క రాష్ట్రంలో నిర్వహించడంతో దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
బాధ్యత ఉండక్కర్లేదా – నెటిజన్స్..
మరి దీనిపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారు? కనీసం సినిమా హీరోగా బాధ్యత లేకపోయినా మా అధ్యక్షుడిగా అయినా బాధ్యత ఉండాలి కదా.. ఇలా బాధ్యత మరిచి తన సినిమా కోసం పాకులాడడం ఎంతవరకు కరెక్ట్? అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గద్దర్ అవార్డ్స్ ను లెక్కచేయకుండా తన సినిమా కోసమే పరితపించడం పలువురు సినీ పెద్దల ఆగ్రహానికి కూడా గురవుతున్నారని సమాచారం. మరి దీనిపై మా ప్రెసిడెంట్ అలియాస్ హీరో మంచు విష్ణు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
ALSO READ:Kavya Maran : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కావ్య పాప పెళ్లి… ఇక రచ్చ రచ్చే!