Game Changer.. ఒకవైపు నార్త్ ఇండియాలో హీరో అల్లు అర్జున్ తెలుగు సినిమా ‘పుష్ప 2’ (Pushpa 2) హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer).అంటూ జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల హవా మొదలయింది. ఇక ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి, ఇతర హీరోల అభిమానుల నుండి పర్వాలేదు అనే టాక్ వినిపిస్తున్నా.. మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు.
సినిమా నుండి నానా హైరానా సాంగ్ కట్..
నిన్న ఈ సినిమా ప్రీమియర్ షోలు యూఎస్ఏ లో పడగా.. ఇప్పుడు ఇండియా వైడ్ విడుదల అయింది ఈ సినిమా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెలోడీ సాంగ్ నంబర్ అయినా “నానా హైరానా” పాట తొలగించడం పై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ రాబట్టి సెన్సేషన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా పాట కోసమే కొంతమంది సినిమాకు వెళ్లారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి వారందరికీ పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో ఈ పాట లేకపోవడం చాలా బాధగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫాన్స్ హార్ట్..
ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan) కియారా అద్వానీ (Kiara advani) మెలోడీ స్టెప్స్ కోసం ఎంతో ఆసక్తిగా చూసిన మెగా ఫాన్స్ కి పాట లేకపోవడంతో బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ” నానా హైరానా” సాంగ్ ఎక్కడ? అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేయడంతో తాజాగా మేకర్స్ కూడా స్పందించారు. ఈ మేరకు ఒక ట్విట్టర్ పోస్ట్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.
పోస్టర్ తో సహా క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
అందులో రామ్ చరణ్, కియారా అద్వానీ నానా హైరానాలోని పాట పోస్టర్ ను షేర్ చేస్తూ.. “ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన మొదటి ఇండియన్ పాట ఇది. అయితే ప్రారంభ ప్రింట్లలో ఇన్ఫ్రారెడ్ చిత్రాల ప్రాసెసింగ్ సమయంలో ఎదురైన సాంకేతిక సవాళ్ల కారణంగా ఈ పాట ఎడిట్ చేయబడింది. నిశ్చితంగా ఉండండి.. ఈ బ్లాక్ బస్టర్ మెలోడీ ఆఫ్ ది ఇయర్ తో మీరందరూ వైబ్ చేసే వరకు మేము కూడా వేచి ఉండలేము. జనవరి 14 నుంచి నానా హైరానా పాట వచ్చే కంటెంట్ లో థియేటర్లలో తిరిగి జోడించడానికి సిద్ధంగా ఉంది” అంటూ తెలిపారు మేకర్స్. ఇకపోతే ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి విడుదలైన పాటలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి . ముఖ్యంగా రామ్ చరణ్ , కియారా లుక్స్, డాన్స్ ఆకట్టుకున్నాయి. అయితే డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కించిన ఈ నాలుగు పాటల కోసమే దాదాపు రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
నానా హైరానా సాంగ్ డీటెయిల్స్..
ఇకపోతే తమన్ (Thaman) కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ లో రామ్ చరణ్, కియారా కూల్ లుక్ తో అందర్నీ ఇంప్రెస్ చేశారు. “నానా హైరానా.. ప్రియమైన హైరానా..” అంటూ సాగిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అందమైన లిరిక్స్ రాయగా.. కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడారు. బోస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ గా పని చేయగా.. ఈ పాట కోసం దాదాపు రూ.10కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది.. పాశ్చాత్య మరియు కర్నాటిక్ సంగీతం యొక్క విశిష్ట సమ్మేళనం మేళవించిన ఈ పాటను న్యూజిలాండ్ లో చిత్రీకరించడం జరిగింది.