BigTV English

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఊచకోత… అప్పుడే 50 కోట్ల మార్క్

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఊచకోత… అప్పుడే 50 కోట్ల మార్క్

Game Changer : తాజా  దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాతో థియేటర్లోకి రాబోతున్నాడు. దీంతో అభిమానులు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను థియేటర్లలో వీక్షించడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా… కియారా అద్వానీ అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్జె సూర్య, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే పలు సమస్యలను ఎదుర్కొని థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఊచకోత కోస్తోంది. ఇంకా 10 గంటలు మిగిలి ఉండగానే, ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే అడ్వాన్స్ కలెక్షన్ల పరంగా.. ‘గేమ్ ఛేంజర్’ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది.


ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్

(Game Changer) మూవీ రిలీజ్ ఇంకా 10 గంటల టైం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియాలో ఈ సినిమాకు సంబంధించి 13,336 షోలు పడగా, వాటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి దాదాపు రూ. 50 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇందులో తెలుగు వర్షన్ నుంచే దాదాపు రూ. 32 కోట్లకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగాయి.


ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే… ఇప్పటిదాకా ఏపీలో రూ.16.4 కోట్లు, తెలంగాణలో రూ. 10.79 కోట్లు, కర్ణాటకలో రూ. 1.46 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్స్ ను ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి మూవీ రిలీజ్ కు ఇంకా గంటల వ్యవధి టైం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 40 కోట్లు దాటడం అన్నది విశేషమే మరి. ఇక ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక స్పెషల్ మూవీగా మిగిలిపోబోతోంది. ముఖ్యంగా ఓపెనింగ్ పరంగా రామ్ చరణ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేయబోతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 70 కోట్లు దాటుతుందని తెలుస్తోంది.

టాప్ 5 ప్రీ సేల్స్ మూవీస్  

ఇదిలా ఉండగా.. ఇప్పటిదాకా టాప్ లో ఉన్న సినిమాల్లో ‘పుష్ప 2’ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ మూవీకి బుక్ మై షోలో 1.91 మిలియన్ల టికెట్ సేల్స్ జరిగినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2వ స్థానంలో ‘కల్కి 2898 ఏడి’ మూవీ 1.10 మిలియన్ టికెట్స్, 3వ స్థానంలో ‘సలార్’ మూవీ 1.6 మిలియన్ టికెట్స్, 4వ స్థానంలో ‘దేవర’ 875k టికెట్స్, 5వ స్థానంలో ‘గుంటూరు కారం’ 349k టికెట్స్ సేల్స్ తో టాప్ 5 ప్లేస్ లో ఉన్నాయి. మరి ‘గేమ్ ఛేంజర్’ వీటిలో ఏ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×