Chahal – Shreyas Iyer: బిగ్గెస్ట్ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ షో తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ భాషలలో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇక ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ “బిగ్ బాస్ 18” షో 2024వ సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
Also Read: SA 20 league 2025: నేటినుంచే SA-20 లీగ్.. బరిలో SRH.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?
భిన్న రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి {Chahal – Shreyas Iyer} అడుగు పెట్టారు. ఈ షో ప్రారంభమై ఇప్పటికి 90 రోజుల పైనే గడిచింది. అయితే బిగ్ బాస్ 18 హిందీ ప్రోగ్రామ్ కి త్వరలో స్పెషల్ గెస్ట్ లు రాబోతున్నారట. ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారెవరో కాదు.. భారత క్రికెట్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, యుజువేంద్ర చాహల్. గత కొద్దిరోజులుగా చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
వీరి విడాకుల గురించి మాత్రమే కాదు సోషల్ మీడియాలో రకరకాల విషయాలు బయటకి వస్తున్నాయి. కొంతమంది ధనశ్రీ చేసిన తప్పును ఎత్తిచూపుతుంటే..? మరి కొంతమంది చాహల్ ఓ అమ్మాయి తో కనిపించాడనే ఫోటోని వైరల్ చేస్తున్నారు. చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకోవడానికి శ్రేయస్ అయ్యర్ కారణమని కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ తో కలిసి చాహల్ బిగ్ బాస్ 18లోకి అడుగుపెట్టబోతుండడం ఆసక్తికరంగా మారింది.
అయితే చాహల్ తన విడాకుల విషయం గురించి ఈ షోలో ఏమైనా ప్రస్తావిస్తారా..? లేక శ్రేయస్ అయ్యర్.. ధనశ్రీ తో ఉన్న రిలేషన్ గురించి బిగ్ బాస్ షో లో ఏమైనా మాట్లాడతారా..? అనేదాని గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు. వీరిద్దరితోపాటు శశాంక్ సింగ్ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సండే ఈవెంట్ లో ఈ ముగ్గురు సందడి చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ ముగ్గురు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Konstas on Virat Kohli: విరాట్ కోహ్లీ నా దేవుడు.. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్ సంచలనం
పంజాబ్ జట్టు శశాంక్ ని రిటైన్ చేసుకోగా.. మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ని రూ. 26.75 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. ఇక చాహల్ ని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఓ నివేదిక ప్రకారం నటి రవినా టాండర్, ఆమె కుమార్తె రాషా, అమర్ దేవగన్ తమ రాబోయే చిత్రం “ఆజాద్” ప్రమోషన్స్ కోసం శనివారం జరిగే బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ కి రానున్నారు. ఇక ఆదివారం రోజు భారత క్రికెటర్లు సందడి చేయనున్నారని.. ఈ ఎపిసోడ్ లో కమెడియన్ కృష్ణ అభిషేక్, అతని భార్య కాశ్మీరా షా కూడా కనిపించబోతున్నారని సమాచారం.