Game Changer : ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ రిలీజ్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు తాజాగా దిల్ రాజు (Dil Raju) గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. మూవీ ప్రమోషన్స్ నవంబర్ మిడిల్ నుంచి భారీ ఎత్తున నిర్వహించబోతున్నాము అంటూ దిల్ రాజు ఏకంగా లిస్ట్ నే వెల్లడించారు. ఏ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేశారో కూడా చెప్పేశారు. దీంతో నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ‘గేమ్ ఛేంజర్’ మూవీ గురించే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ‘గేమ్ ఛేంజర్’ బాగా ట్రెండ్ అవుతోంది. అయితే విచిత్రంగా ‘గేమ్ ఛేంజర్’తో పాటు “అన్‌ప్రిడిక్టబుల్” అనే పదం కూడా ట్రెండింగ్ లో కన్పిస్తోంది. మరి ‘గేమ్ ఛేంజర్’కు దీనికి ఉన్న లింకు ఏంటి ? అసలు ఈ పదం వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటించిన పొలిటికల్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ మూవీ 2025 జనవరి 10న విడుదల కానుండగా, ఇప్పటి నుంచే సంచలనం సృష్టిస్తోంది. శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. నిన్న చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు కంప్లీట్ ప్రమోషనల్ ప్లాన్ ను రివీల్ చేశారు.
అందులో భాగంగానే నవంబర్ 9 న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుందని ప్రకటించడంతో మెగా అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరంగా సినిమా టైటిల్‌తో పాటు “అన్‌ప్రిడిక్టబుల్” అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం కన్పించింది. దీంతో కొంతమంది అసలు ‘గేమ్ ఛేంజర్’తో పాటు ఈ స్పెషల్ వర్డ్ ఎందుకు ట్రెండ్ అవుతోంది అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ పదం ట్రెండ్ అవ్వడం వెనకున్న స్టోరి ఏంటంటే.. “అన్‌ప్రిడిక్టబుల్” అనేది ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లో ఉండే శక్తివంతమైన లైన్ అని తేలింది. టీజర్ 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉంటుందని తాజాగా బయటకు వచ్చిన వార్త అంచనాలను పెంచింది. అయితే ఏ సందర్భంలో చెర్రీ సినిమాలో ఈ పదాన్ని వాడతాడు అనేది మాత్రం క్లారిటీ లేదు. అలాగే దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు ఎస్జె సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, అంజలి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ పైనే ఉంది.