Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు.. ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు పోల్చి చూస్తే.. చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఆయన సినిమా గురించి, హీరో గురించి చెప్పే మాటలు, ఇచ్చే హైప్ ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వలేరు. అది కాన్ఫిడెన్స్ అనుకోవాలో.. లేక ఓవర్ యాక్షన్ అనుకోవాలో అనే డైలమాలో పడిపోతారు అభిమానులు.
ఇక ఈ ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. హిందీలో భారీ విజయాన్ని అందుకున్న రైడ్ సినిమాకు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కింది. అయితే దాన్ని రీమేక్ అని ఫ్యాన్స్ అనుకోకూడదు. కేవలం ఆ సినిమా లైన్ తీసుకొని.. మిగతాదంతా హరీష్ శంకర్ మార్చాడని అనుకోవాలి. హరీష్ శంకర్ – రవితేజ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. షాక్, మిరపకాయ్.దీంతో ముచ్చటగా మూడోసారి ఈ కాంబో కలుస్తుంది అని తెలిసినప్పటి నుంచే సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయ్యింది.
Pawan Kalyan: పిఠాపురంపై పవన్ స్పెషల్ ప్లాన్.. అదే జరిగితే ఊరంతా పండగేనట.. అదేమిటో తెలుసుకుందాం!
అయితే ఆ హైప్ ను అలా ఉంచేసినా బావుండేది. కానీ, హరీష్ శంకర్ ఓవర్ కాన్ఫిడెంట్ గా మిస్టర్ బచ్చన్.. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంతకుముందు మీరు చూడని రవితేజను చూస్తారు… అని ఇంకా హైప్ పెంచాడు. అవన్నీ పక్కన పెడితే వివాదాలు.. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ స్టెప్స్, ఏజ్ డిఫరెన్స్.. ఇలా చాలా వచ్చాయి. వాటిని సైలెంట్ గా ఇగ్నోర్ చేయకుండా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా మాట్లాడాడు. రిలీజ్ అయ్యాక కూడా ఆ సినిమాలో చాలా తప్పులని నెటిజన్స్ కనిపెట్టారు. వాటికి కూడా ఆయన తనకు నచ్చినట్లు సమాధానాలు చెప్పుకొచ్చాడు.
ఇక ఏదిఏమైనా మిస్టర్ బచ్చన్ మాత్రం మిక్స్డ్ టాక్ ను అందుకొని కలక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. సరే.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నారు అని అంటే.. ఈ మధ్యనే ఐఫా వేడుకలు అబుదాబిలో గ్రాండ్ గా జరిగిన విషయం తెల్సిందే. ఈ వేదికపై టాలీవుడ్ హల్క్ రానా, కుర్ర హీరో తేజ సజ్జ హోస్టింగ్ చేస్తూ.. టాలీవుడ్ ప్లాప్ సినిమాలను దారుణంగా రోస్ట్ చేశారు.
Ketika Sharma:ఎత్తుపల్లాలను ఎరగా వేసి.. ఇలా చూపిస్తే కుర్రవాళ్లను ఆపడం కష్టమే
” ఈ ఏడాది బచ్చన్ గారు హయ్యస్ట్ హై.. లోయస్ట్ లో కూడా చూసారు” అని రానా చెప్పగా.. వెంటనే తేజ హయ్యెస్ట్ అంటే కల్కి.. మరీ లోయస్ట్ ఏంటి అని అడగ్గా.. రానా మాట్లాడుతూ అదేరా .. మిస్టర్ బచ్చన్ అని సెటైర్ వేశాడు. ఇక తేజ .. వద్దు భయ్యా ఆపేసేయ్” అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రవితేజ, హరీష్ శంకర్ ఫ్యాన్స్ ఈ వీడియోను వారికి షేర్ చేస్తూ.. మన సినిమాపై జోకులు వేస్తున్నారు అన్నా.. మీకేం అనిపించడం లేదా.. ? నవ్వేవాళ్ళు అందరు క్లాప్స్ కొట్టాలి. దీనికి సమాధానం ఇవ్వండి.. రవితేజతో మరో సినిమా తీయండి.. మేము కాలర్ ఎగరేయాలి అని కామెంట్స్ పెడుతున్నారు.
Sandeep Reddy Vanga: ఆ హీరోలు అయిదేళ్లు తిప్పించుకొని మోసం చేశారు.. సందీప్ వంగా సాడ్ స్టోరీ
ఇక దీంతో ఆ వీడియోపై హరీష్ శంకర్ స్పందించాడు.. ” ఎన్నో.. విన్నాను తమ్ముడు… అందులో ఇదోటి … అన్ని రోజూలు ఒకేలా ఉండవు నాకైనా..ఎవరికైనా” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు హరీష్ – రవితేజ కాంబో మళ్లీ రీపీట్ అవుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.
ఎన్నో … విన్నాను తమ్ముడు …
అందులో ఇదోటి …..
అన్ని రోజూలు ఒకేలా ఉండవు
నాకైనా ….ఎవరికైనా …… https://t.co/nqXKbaYf4V
— Harish Shankar .S (@harish2you) November 5, 2024