Game Changer Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ ఇది. భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచ వ్యాపంగా విడుదలైంది. ఇక భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది. కానీ, రోజురోజుకు గేమ్ చేంజర్ వసూళ్లు తగ్గుతున్నాయనే టాక్ ఒకవైపు వినిపిస్తుంది. అందుకు కారణం కలెక్షన్స్.. మొదటి రోజు భారీగా అందుకున్న మూవీ రెండో రోజు కాస్త తగ్గింది. మూడో రోజు కూడా పెద్దగా వసూల్ చెయ్యలేదు. నాల్గొవ రోజు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అవ్వడంతో కలెక్షన్స్ బాగా తగ్గాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్ని కోట్లు నాలుగు రోజులకు వసూల్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
గేమ్ ఛేంజర్ మూవీ..
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్. ఈ మూవీలో రామ్ చరణ్ కథనాయకుడు గా నటించగా.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, సునీల్ , జయరామ్, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వివేక్ వేల్మురుగన్ స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ భారీ బడ్డెట్ మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.. భారీ అంచనాలతో పాటుగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది.
కలెక్షన్స్ విషయానికొస్తే..
ఈ మూవీ మొదటి రోజుతోనే మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ కూడా తగ్గినట్లు టాక్.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక రెండో రోజు నుంచి గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ తగ్గాయి. రెండో రోజు గేమ్ చేంజర్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 21.6 కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక మూడో రోజు కలెక్షన్లు కూడా తగ్గాయి. మూడు రోజు రూ.17 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది.. బాక్సాఫీస్ వద్ద రూ. 8.50 కోట్లు అందుకుంది . దీంతో మొత్తం నాలుగు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.97 కోట్ల కు చేరుకుంది.. మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ ను ఎప్పుడో వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ రెండు సినిమాల ను లైనప్ లో పెట్టుకున్నారు. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చెయ్యనున్నారు.