Daaku Maharaj: పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల్లో ఒకేసారి విడుదల అవ్వాల్సిన అవసరం లేదు. వీలును బట్టి ప్రతీ భాషలో విడుదల తేదీ మారుతూ వస్తుంది. అలా అని ప్రతీ భాషలో విడుదలయిన సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ కూడా ఇవ్వలేము. మామూలుగా ఒక భాషలో విడుదలయిన చిత్రం.. మరొక భాషలో డబ్ అవ్వడం సహజం. అలా బాలకృష్ణ హీరోగా ఇటీల విడుదలయిన ‘డాకు మహారాజ్’ కూడా తమిళంలో డబ్ అయ్యి అక్కడ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగులో పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతున్న ఈ సినిమా తమిళ ప్రేక్షకులను తమ భాషలోనే అలరించనుంది. దానికి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది.
తమిళంలో ఫోకస్
బాలకృష్ణ సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. స్టోరీ రొటీన్‌గా ఉన్నా అందులో బాలయ్య యాక్షన్, డైలాగులు, ఫైట్స్‌పై ఆడియన్స్ అంచనాలు పెంచేసుకుంటారు. ‘డాకు మహారాజ్’ విషయంలో కూడా అదే జరిగింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య తన స్టైల్‌లో యాక్షన్ చేస్తే చాలు అని ప్రేక్షకులు అనుకున్నారు. అందుకే స్టోరీ రొటీన్‌గా ఉన్నా చాలామందికి ఈ సినిమా నచ్చింది. జనవరి 12న ఈ మూవీ థియేటర్లలో విడుదల కాగా.. చాలామందిని ఇంప్రెస్ చేసి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ప్రస్తుతం మేకర్స్ దృష్టి మొత్తం తమిళ ఆడియన్స్‌పై పడింది. తమిళంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఫోకస్ మొదలుపెట్టారు.
Also Read: ఇండైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేసిన అనిల్.. గట్టిగానే వేసాడుగా.?
సంక్రాంతికి కాదు
సంక్రాంతికి తెలుగులోనే కాదు.. తమిళ సినిమాల మధ్య కూడా గట్టి పోటీనే జరిగింది. అక్కడ కూడా దాదాపు అరడజను చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. అందుకే తెలుగు సినిమాలను తమిళంలో డబ్ చేసి విడుదల చేయడానికి సంక్రాంతి సరైన సమయం కాదు అనుకొని మేకర్స్ సైతం వెనక్కి తగ్గారు. ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) విషయంలో కూడా అదే జరిగింది. జనవరి 12న ఈ మూవీ తెలుగులో విడుదల కాగా.. ఈ సినిమాకు సంబంధించిన తమిళ డబ్బింగ్ వర్షన్ మాత్రం జనవరి 17న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇక ఈ మూవీపై తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడం కోసం త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయనున్నాడు మేకర్స్.
మ్యూజిక్ హైలెట్
‘డాకు మహారాజ్’లో బాలకృష్ణ (Balakrishna) సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ అయ్యింది. మామూలుగా బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ఏ సినిమా అయినా కమర్షియల్‌గా ఫ్లాప్ అయినా కూడా మ్యూజిక్ పరంగా మాత్రం ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. అలాగే ‘డాకు మహారాజ్’ కూడా ఉంటుందని ముందుగానే ఫ్యాన్స్‌కు నమ్మకం ఇచ్చాడు తమన్. తను చెప్పినట్టుగానే మూవీలో మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది.