Big Stories

Jaragandi Song from ‘Game Changer’: జరగండి.. జరగండి.. గ్లోబల్ స్టార్ వచ్చే సమయం ఆసన్నమైంది!

Jaragandi Song Ram Charan’s Game Changer Movie: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ఒకటి. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. శ్రీకాంత్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్ వస్తుంది అంటే సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవ్వడం ఖాయమే. అందులోనూ చరణ్ బర్త్ డే స్పెషల్ అంటే అభిమానులు ఆగుతారా.. ? ఏ సినిమా నుంచి ఏ పోస్ట్ వస్తుందా.. ? అని  వారం ముందు నుంచే ఎదురుచూస్తున్నారు. ఎప్పటినుంచో ఈ సినిమా నుంచి జరగండి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూనే ఉన్నారు.. కానీ, అది మాత్రం అమలులోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం అది కచ్చితంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Also Read: Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఈ పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా బాసు

రేపు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో.. ఈసారి గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ తో పాటు పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. పార్టీ వేర్ డిజైనర్ డ్రెస్ లో చరణ్ మెరిసిపోతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి.. రాజమౌళి సినిమా తరువాత  ఏ హీరో సినిమా అయినా ప్లాప్ అందుకోవడం సెంటిమెంట్ గా వస్తుంది. ఇప్పుడు చరణ్ గేమ్ ఛేంజర్ కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతుందా.. ? అనేది ఒకటి అయితే.. శంకర్ లాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా అంటే రికార్డు బద్దలు కొడుతుందా ..? లేదా.. ? అనేది ఇంకొకటి.. మరి ఈ సినిమా అభిమానులు అనుకుంటున్న అంచనాలను దాటుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News