BigTV English

Manchu Family Issue: మనోజ్‌పై దాడి చేయించింది మోహన్ బాబే… వీడియో లీక్‌తో అసలు నిజం బయటికి..?

Manchu Family Issue: మనోజ్‌పై దాడి చేయించింది మోహన్ బాబే… వీడియో లీక్‌తో అసలు నిజం బయటికి..?
Advertisement

Manchu Family Issue:  మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు ఉన్నాకొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ఇద్దరు కుమారుల ఆస్తి తగాదాల వలన కొట్టుకున్నారని ఒకసారి.. కోడలు మౌనిక వలనే తగాదాలు మొదలయ్యాయని ఇంకోసారి.. ఇలా ఒక్కొక్కరు ఒకమాట చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే.. ఆస్తి తగాదాల నేపథ్యంలో మోహన్ బాబు- మంచు మనోజ్  కొట్టుకున్నారు. మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.


తన తండ్రి తనను కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ కంప్లైంట్ చేశాడు.  శరీరం మొత్తం గాయాలతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశాడు. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందనిన తెలిపాడు. ఇంకోపక్క  మోహన్ బాబు సైతం తన కొడుకు వలన ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో జరుగుతుంది ఆస్తుల వివాదం కాదు.. ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కామెంట్స్


ఇక ఈ గొడవలకు ప్రధాన కారణం వినయ్ అని తెలుస్తుంది. తండ్రి మోహన్ బాబు వినయ్ మహేశ్వర్‏కి కాలేజ్ బాధ్యతల్లో పెద్దపీట వేయడం.. మొదటి నుంచి మనోజ్  కు నచ్చేది కాదని, వినయ్ అక్రమ కార్యకలాపాలు సాగించేవాడని ఎన్నోసార్లు అతడితో మనోజ్ గొడవపెట్టుకున్నాడు.

ఇక ఇప్పుడు కూడా మనోజ్ ఇంటికి వినయ్ తన మనుషులను పంపి దాడి చేయించినట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. మోహన్ బాబు సమక్షంలో జరిగిన గొడవలోనే వినయ్ తనపై చేయి చేసుకోవడంతో పాటు తన పట్ల అసభ్యంగా దూషించాడని, ఇదే క్రమంలో దాడి జరిగిన తరువాతి రోజు మోహన్ బాబు ఇంటికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్ తో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అప్పటికే ఇంట్లో ఉన్న సీసీ కెమెరా, డీవీఆర్ ను వినయ్ తీసుకెళ్లినట్టు మనోజ్ పోలీసులకు తెలిపాడు. అయితే అందులో నిజం లేదని, మనోజ్ తనను కొట్టాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు.

Gopichand: సక్సెస్ కోసం గోపీచంద్ మరో రిస్క్.. ఈసారి కూడా ప్లాప్ డైరెక్టర్ తోనే.. ?

అయితే మోహన్ బాబునే.. మనోజ్ పై దాడి చేయించినట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మోహన్ బాబు కుర్చీలో కూర్చుని ఉండగా ఎదురుగా బౌన్సర్లతో పాటు చాలా మంది ఉన్నారు. మోహన్ బాబు ఆదేశాలతో ఓ వ్యక్తిపై బౌన్సర్లు దాడి చేస్తున్నారు. ఈ దృశ్యాలను మోహన్ బాబు ఇంటి పై అంతస్తు నుంచి  ఒకరు తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో ప్రకారం.. మంచు మనోజ్ చెప్పింది నిజమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నేటి ఉదయం.. తండ్రీ కొడుకులు ప్లేట్ మార్చారు. తన తండ్రి తనపై దాడి చేయించలేదని, ఎవరో గుర్తు తెలియనివారు వచ్చి దాడి చేసినట్లు మనోజ్ తెలుపగా.. మోహన్ బాబు సైతం.. ఇంట్లో చిన్న తగాదా.. అన్నదమ్ముల మధ్య ఉండే గొడవలే. మా సమస్యలను మేము పరిష్కరించుకుంటామని చెప్పుకొచ్చాడు. ఇంకోపక్క  మంచు ఇంట్లో పనిమనిషి.. మనోజ్ – మోహన్ బాబు నెట్టుకున్నారు.

Pawan Kalyan: ఒకవైపు ‘ఓజీ’, మరొకవైపు ‘హరిహర వీరమల్లు’.. పవన్ రెండు పడవల ప్రయాణం

విష్ణు కు తండ్రి అంటే ప్రాణం. ఆయన మీద చెయ్యి వేస్తే అస్సలు ఊరుకోడు. మనోజ్ అలా చేసేసరికి ఇంకా గొడవ పెద్దది అయ్యి.. ఆయనను బయటకు గెంటేశాడు అని చెప్పుకొచ్చింది. ఆస్తి తగాదాల్లో మనోజ్ ను ఒంటరిగా చేశారు మంచు ఫ్యామిలీ. అయితే తనకు ఆస్తి ముఖ్యం కాదని, ఆత్మాభిమానం కోసం మాత్రమే అని మనోజ్ చెప్పుకొస్తున్నాడు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×