BigTV English

Game changer teaser promo : గేమ్ చేంజర్ టీజర్ ప్రోమో వచ్చేసింది, గ్రాండ్ లెవెల్ లో చూపించబోతున్నారు

Game changer teaser promo : గేమ్ చేంజర్ టీజర్ ప్రోమో వచ్చేసింది, గ్రాండ్ లెవెల్ లో చూపించబోతున్నారు

Game changer teaser promo : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మొదలై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది. ఈ సినిమాతో పాటు భారతీయుడు 2 సినిమాకి కూడా వర్క్ చేశాడు శంకర్. ఆ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేస్తారు అని మొదట్లో చెప్పుకొచ్చారు. కానీ రీసెంట్ గా ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా మంచి రిలీజ్ అయిన రెండు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా నుంచి టీజర్ నవంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.


ఈ టీజర్ చాలా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా తర్వాత చరణ్ కంప్లీట్ రోల్ లో కనిపిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. దానికి తోడు శంకర్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. ఈ సినిమాలో పలు రకాల గెటప్స్ లో కనిపించనున్నాడు చరణ్. దీని సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో లీక్ అయ్యాయి. ఇక తాజాగా రేపు టీజర్ రిలీజ్ చేస్తున్న తరుణంలో ఈ టీజర్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Also Read : Nikhil Siddhartha : చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావ్ భయ్యా


13 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రోమో, కంప్లీట్ టీజర్ పైన విపరీతమైన అంచనాలను పెంచుతుంది. కేవలం 13 సెకన్లు లో రామ్ చరణ్ ఫేస్ చూపించకుండా కొన్ని షాట్స్ ను ప్రజెంట్ చేశారు. ఈ ప్రోమో ఓపెన్ చేయగానే బైక్ పై రయ్ అంటూ బాయ్స్ హాస్టల్ కి దూసుకు రావడం, ఆ తర్వాత హెలికాప్టర్ ల్యాండింగ్, చరణ్ ను వెనకనుంచి చూపించడం ఈ బిల్డప్ షాట్స్ అన్నీ కూడా బాగా ప్రెసెంట్ చేశారు. ముఖ్యంగా ఈ చిన్న ప్రోమోలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ ప్రోమో చూస్తుంటే ఖచ్చితంగా టీజర్ అభిమానుల అంచనాలను అందుకొని సినిమా మీద మరింత మార్కెట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×