Game Changer Teaser Response: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో గేమ్ చేంజెర్ ఒకటి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దాదాపు మూడేళ్లు నుండి షూటింగ్ జరుపుకుంటుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎన్నో వాయిదాలు పడుతూ ఇంతవరకు వచ్చింది. మొత్తానికి ఈ సినిమాను సంక్రాంతి కానుక జనవరి 10 2025న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇంతకుముందు ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తామని దిల్ రాజు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది కాబట్టి ఈ సినిమాని సంక్రాంతి బరిలో దించుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. శంకర్ తెలుగులో చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
గేమ్ చేంజర్ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వాస్తవానికి ఈ టీజర్ చాలామందికి అర్థం కాలేదు. కొంతమంది ఈ టీజర్ ను వీడియో గేమ్ లా ఉంది అని కామెంట్స్ కూడా చేశారు. ఇంకొంతమంది టీజర్ ఆగమాగం ఉంది అంటూ మరికొన్ని కామెంట్స్ చేశారు. ఏదేమైనా ఈ టీజర్ కి మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది అనేది వాస్తవం. కేవలం 24 గంటలు ఈ టీజర్ కు 55 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఒక అంచనా వేయొచ్చు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ మూడు రకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
Also Read: Varun Tej : లో బడ్జెట్ వలన నేను చేసిన ఆ సినిమా ఫెయిల్ అయింది
ఇదివరకే శంకర్ దర్శకత్వం వహించిన ఒకే ఒక్కడు వంటి సినిమాలలో పొలిటికల్ టచ్ ను బాగానే చూపించాడు. వాస్తవానికి ఈ సినిమా కథను కార్తీక్ సుబ్బరాజ్ తన టీం తో పాటు రెడీ చేశారు. కథ మొత్తం అయిపోయిన తర్వాత డిస్కషన్ చేస్తున్నప్పుడు ఇది శంకర్ సార్ లెవెల్ లో ఉంది అంటూ అందరూ అనుకున్నారు. అందుకోసమే ఈ కథను శంకర్ తీస్తే బాగుంటుంది అనుకుని కార్తీక్ ఈ కథను శంకర్ అందించారు. ఇక కార్తీక్ సుబ్బరాజు రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తీసిన ప్రతి సినిమా కూడా ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. అలానే లోకేష్ కనకరాజ్ వంటి దర్శకులను కూడా ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీకి అందించాడు కార్తీక్ సుబ్బరాజ్. ఒక శంకర్ విషయానికొస్తే రీసెంట్ గా వచ్చిన భారతీయుడు సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.