Ss Thaman : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్ సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు. మొదట కిక్ పాటలు విన్న వెంటనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపడిపోయింది. ఎవరి కొత్త కుర్రాడు ఇంత బాగా సాంగ్స్ ని కంపోజ్ చేశాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ కుర్రాడే చాలా ఏళ్లు పాటు మణిశర్మ దగ్గర పని చేస్తూ ఎంతోమంది స్టార్ హీరోస్ కి కూడా పరిచయం ఉన్న సాయి అని తెలియదు. సాయి ఏంటి కొత్తగా అని అనుకుంటున్నారా.? అవును ఎస్ఎస్ తమన్ పేరు సాయి. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు తమన్ ను సాయి అని పిలుస్తారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తమన్ కి చాలామంది దర్శకులతో ముందునుంచే పరిచయం ఉంది. దీనికి కారణం చాలామంది దర్శకులు మణి శర్మతో పనిచేయటం.
కిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమన్ పేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. ఒక సందర్భంలో తమన్ వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. చాలా తొందరగా తన 50 సినిమాలను కూడా పూర్తి చేశాడు. తమన్ వర్క్ చూసి చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. అయితే ఎవరికైనా ఒక ప్రత్యేకమైన టైం నడుస్తుంది అని చెప్పినట్లు తమను కూడా కొంత టైం నడిచింది. కొంతకాలానికి తమన్ మ్యూజిక్ కూడా చాలామందికి బోర్ కొట్టింది. అదే బేస్ లో సాంగ్స్ కొడతాడు కొత్తగా ట్యూన్స్ ఏమీ వాడడు అంటూ చాలామంది విమర్శలు కూడా చేశారు.
అయితే వెంకీ అట్లూరి దర్శకుడుగా పరిచయమైన తొలిప్రేమ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు తమన్. కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్రెష్ మెలోడీ సాంగ్స్ ను ఆ సినిమాకు కంపోజ్ చేశాడు. అక్కడితో తమన్ లెవెల్ మారిపోయింది. ఇక తమన్ 100వ సినిమా గా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తమను నెక్స్ట్ లెవెల్ లో కూర్చోబెట్టింది. చాలామంది స్టార్ హీరోలకి తమన్ సంగీతం అందించే స్థాయికి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. చాలామంది స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా తమ హీరోకు సరైన ఆల్బమ్స్ ఇవ్వట్లేదు అంటూ తనని పర్సనల్ గా ట్రోల్ కూడా చేస్తారు. ఎంతమంది టోల్ చేస్తారో అంతకంటే ఎక్కువమంది తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పొగుడుతూ ఉంటారు.
Also Read : Krishnudu: మూడు కోట్ల రూపాయలు కారుపై గీత పడిన నాగార్జున గారు ఏమీ అనలేదు
ఇకపోతే ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుక 2025లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా గ్లిమ్స్ అనౌన్స్ చేసిన వీడియోలో ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా అనౌన్స్మెంట్ వీడియోకు కూడా అటువంటి మ్యూజిక్ ని కంపోజ్ చేశాడు అనిరుధ్. అదే మ్యూజిక్ ని గేమ్ చేంజర్ కోసం తమన్ కాపీ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్లు కనిపిస్తున్నాయి.