Best Horror Movies on OTT : ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాలను కొత్తగా చూపించడంలో సక్సెస్ అవుతున్నారు మేకర్స్. గూస్బమ్స్ తెప్పించే ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధించాయి. ముంజ్యా నుంచి షైతాన్ వరకు గూస్బమ్స్ తెప్పించే ఈ సినిమాలు, ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
స్త్రీ 2 (Stree 2)
2024లో విడుదలైన ఈ సినిమాకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్, పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
షైతాన్ (Shaitaan)
2024లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దేవగన్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ నిర్మించాయి. ఇందులో అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, జ్యోతిక, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్ నటించారు. షైతాన్ ఒక అపరిచిత వ్యక్తి చేత తమ కుమార్తె మాయలో పడినప్పుడు, ఇబ్బందులను ఎదుర్కొనే కుటుంబం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. జ్యోతిక తన తొలి చిత్రం డోలీ సాజా కే రఖ్నా తర్వాత బాలీవుడ్ లో నటించిన రెండవ మూవీ ఇదే. షైతాన్ మహా శివరాత్రి సందర్భంగా 8 మార్చి 2024న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ₹60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
భూల్ భూలయ్యా 3 (Bhool Bhulaiyaa 3)
2024లో విడుదలైన ఈ హార్రర్ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. T-సిరీస్ ఫిల్మ్స్, సినీ1 స్టూడియోస్ నిర్మించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, ట్రిప్తి డిమ్రీ నటించారు. భూల్ భూలయ్యా 3 2024 నవంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ₹423 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ముంజ్యా (Munjya)
2024 విడుదలైన ఈ హార్రర్ మూవీకి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. శర్వరి, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ నటించారు. మడాక్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అమర్ కౌశిక్, దినేష్ విజన్ ఈ మూవీని నిర్మించారు. ముంజ్యా జూన్ 7, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది, విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకొంది. ₹30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, ప్రపంచవ్యాప్తంగా ₹132 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ డిస్ని + హాట్స్టార్ (Disney + HotStar) లో స్ట్రీమింగ్ అవుతోంది.