BigTV English

Game Changer : ప్లాన్ మార్చేసిన శంక‌ర్‌..రామ్ చ‌ర‌ణ్ టార్గెట్ మారిందా!

Game Changer : ప్లాన్ మార్చేసిన శంక‌ర్‌..రామ్ చ‌ర‌ణ్ టార్గెట్ మారిందా!

Game Changer : మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రం గేమ్ చేంజ‌ర్‌. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మ‌న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు. కాగా.. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుంద‌నే దానిపై రీసెంట్ అప్‌డేట్‌లో మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో గేమ్ చేంజ‌ర్ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికే విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌నే వార్త‌లు గ‌ట్టిగానే వినిపించాయి.


మ‌రో వైపు నిర్మాత‌లు సైతం గేమ్ చేంజ‌ర్ రిలీజ్ డేట్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న ఇచ్చే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. అందుకు కార‌ణం.. సినిమా షూటింగ్ పూర్తి కాక‌పోవ‌ట‌మే. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ విష‌యంలో లేటెస్ట్‌గా మ‌రో న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే గేమ్ చేంజ‌ర్‌ను ఈ ఏడాదిలో డిసెంబ‌ర్ టార్గెట్‌గా విడుద‌ల చేయాల‌ని ప్ర‌స్తుతం ఆలోచిస్తున్నార‌ట‌. ఎందుకంటే డిసెంబ‌ర్‌లో అయితే పెద్ద సినిమాలు పోటీ లేదు.. పాన్ ఇండియా రేంజ్‌లో కావాల్సినన్ని థియేట‌ర్స్ దొరికే అవ‌కాశాలుండ‌ట‌మే దీనికి కార‌ణంగా క‌నిపిస్తుంది. మ‌రి శంక‌ర్‌, దిల్‌రాజు .. రామ్ చ‌ర‌ణ్ టార్గెట్‌ను ఎలా మారుస్తార‌నేది అంద‌రిలోనూ ఆసక్తిని రేపుతోన్న అంశం.

గేమ్ చేంజ‌ర్ మూవీ ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్ర పొలిటీషియ‌న్‌గా క‌నిపిస్తే.. మ‌రో పాత్ర‌లో చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌గా చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నారు. చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ క‌నిపించ‌నుంది. ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×