BigTV English

Montreal Riots Trudeau: మాంట్రియల్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు.. మ్యూజిక్ షోలో ప్రధాని డ్యాన్సులు!

Montreal Riots Trudeau: మాంట్రియల్‌లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు.. మ్యూజిక్ షోలో ప్రధాని డ్యాన్సులు!

Montreal Riots Trudeau| దేశంలో హింసాత్మకంగా నిరసనలు జరుగుతుంటే.. ప్రధాన మంత్రి మాత్రం మ్యూజిక్ కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తూ డాన్సులు వేశారు. ఈ ఘటన ప్రస్తుత భారత శత్రువు కెనడా దేశంలో జరిగింది. ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ నవంబర్ 23న టొరొంటో నగరంలో జరిగింది. ఆమె మ్యూజిక్ షో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.


అయితే పాప్ సింగ్ టేలర్ మ్యూజిక్ షోలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో డాన్సులు వేస్తూ కనిపించారు. ఆయన తన కుటుంబంతో పాటు ఈ షో చూడడానికి వెళ్లారు. టేలర్ స్విఫ్ట్ ఐకానిక్ పాట ‘యు డోంట్ ఓన్ మి’ చాలా పాపులర్. ఈ పాటకు మ్యూజిక్ షో జరుగుతుండగా అభిమానుల మధ్య కూర్చొని ఉన్న ట్రూడో చిందులు వేస్తూ కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కానీ ఈ వీడియోలపై కెనడా జనం మండిపడుతున్నారు. కారణం అదే సమయంలో అంటే నవంబర్ 22న కెనడాలోని మాంట్రియల్ నగరంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి.

ఈ నిరసనల్లో దాదాపు 800 మంది నిరసనకారులు పాల్గొన్నారు. అదే సమయంలో నాటో దేశాల (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సదస్సు క్యూబెక్ నగరంలో జరిగింది. అయితే యూదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బొమ్మను నిప్పంటించారు. ఆ తరువాత నిరసనకారులు పరిసరాల్లోని షాపులు, కార్లు కూడా ధ్వంసం చేశారు. మాంట్రియల్ నగరంలో ఇంత హింస జరుగుతుంటే దేశ ప్రధాని మ్యూజిక్ షోలో ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ పంచుతూ, డాన్సులు చేస్తూ కనిపించడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీనికి ముఖ్య కారణం మాంట్రియల్ నగర ప్రతినిధి మరెవరో కాదు స్వయంగా జస్టిన్ ట్రూడోనే.


Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

సోషల్ మీడియాలో నిరసన వీడియోలు, ప్రధాని ట్రూడో మ్యూజిక్ షో వీడియోలు ఒకేసారి దర్శన మిస్తున్నాయి. దీంతో నెటిజెన్లు ప్రధాని ట్రూడోని ఒకప్పటి రోమ్ నగర నియంత నీరోతో పోల్చుతూ కామెంట్లు చేశారు. రోమ్ నగరం తగలబడుతూ ఉంటే ఆ రాజ్యం చక్రవర్తి నీరో మాత్రం కవిత్యం, పద్యాలు వల్లేస్తూ ఉన్నారంట. అందుకే రోమ్ నగర అతిక్రూర చక్రవర్తి నీరో చరిత్రలో నిలిచిపోయారు.

ఒక యూజర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కామెంట్ చేస్తూ.. “మాంట్రియల్ కాలిపోతోంది. ప్రధాని ట్రూడో టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ లో ఎంజాయ్ చేస్తున్నాడు” అని రాశాడు.

మరొక యూజర్ అయితే.. “దేశాన్ని 1.2 ట్రిలియన్ డాలర్ల అప్పుల ఊబిలోకి నెట్టేసి, దేశ సరిహద్దులు ప్రమాదంలో పడేసి ఈ ప్రధాని టేలర్ స్విఫ్ట్ షోలో డ్యాన్సులు చేస్తున్నాడా?” అని కామెంట్ పెట్టాడు.

కానీ కొందరు ప్రధాని ట్రూడోకు మద్దతుగా నిలబడ్డారు. “ప్రధాని మనిషి కాదా. అతను తన కూతురితో కాసేపు మ్యూజిక్ షోకు వెళ్లకూడదా?” అని ప్రశ్నించారు.

మాంట్రియల్ హింసాత్మక నిరసనలను ప్రధాన మంత్రి ట్రూడో ఖండించారు. యూదులకు వ్యతిరేకంగా నిరసనలు చేయడం, హింసను ప్రేరేపించడం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×