BigTV English

Big TV Kissik Talks: బిగ్ బాస్ 9 ఎంట్రీపై గంగవ్వ క్లారిటీ.. నాగ్ నా తమ్ముడే అంటూ!

Big TV Kissik Talks: బిగ్ బాస్ 9 ఎంట్రీపై గంగవ్వ క్లారిటీ.. నాగ్ నా తమ్ముడే అంటూ!

Big TV Kissik Talks: బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమం ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ (Jabardast) బ్యూటీ వర్ష (Varsha) యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు సీనియర్ స్టార్ సెలబ్రిటీలు, జూనియర్ సెలబ్రిటీలు కూడా వచ్చి సందడి చేశారు. సినిమా, సీరియల్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ షోకే ఆహ్వానిస్తూ మనకు తెలియని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అటు సోషల్ మీడియా ఇటు బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకొని అటు నాగార్జున (Nagarjuna)వంటి స్టార్ హీరోల మన్ననలు పొందిన గంగవ్వ (Gangavva ) కూడా ఈ షోకి హాజరైంది. తాజాగా ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9)ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది.


బిగ్ బాస్ 9 ఎంట్రీ ఫై గంగవ్వ క్లారిటీ..

ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం ఎన్ని షోలు, సినిమాలు చేస్తున్నారు అని వర్ష ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఏడెనిమిది సినిమాలలో చేస్తున్నాను అని చెప్పిన గంగవ్వ బిగ్ బాస్ 9 ఎంట్రీ పై కూడా క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ 9 లో ఎంట్రీ ఇస్తున్నారట నిజమేనా? అని ప్రశ్నించగా.. “ఇప్పటికే 2 సార్లు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళొచ్చాను. నన్ను బిగ్ బాస్ కన్నతల్లి అంటున్నారు. నేను బిగ్ బాస్ కి వెళ్తేనే చిన్నపిల్లలు, పెద్ద వాళ్ళు, ముసలి వాళ్లు అందరూ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఒకరకంగా చెప్పాలి అంటే చిన్నపిల్లలను మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరూ నా ఫ్యాన్సే.


బిగ్ బాస్ 9లోకి కూడా వెళ్తాను.. అక్కడ ఒక ఐదు వారాలు ఉండి వస్తాను అంటూ గంగవ్వ ధీమాగా చెప్పేసింది గంగవ్వ. ఇక ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో మొత్తానికి అయితే బిగ్ బాస్ 9 లోకి ఒక కంటెస్టెంట్ కంఫర్మ్ అయిపోయినట్టే అని క్లారిటీకి వస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు.

నాగార్జున నా తమ్ముడే -గంగవ్వ

ఇకపోతే బిగ్ బాస్ 9 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన గంగవ్వతో బిగ్ బాస్ హౌస్ ఏమైనా మీ పుట్టిల్లు అనుకుంటున్నావా? అని ప్రశ్నించగా..నాగార్జున నా తమ్ముడే కదా అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం పాడవడానికి కారణం అక్కడ తయారు చేసే వంటలే అంటూ కూడా చెప్పు కొచ్చింది గంగవ్వ. మొత్తానికి గంగవ్వకి సంబంధించిన ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

గంగవ్వ బిగ్ బాస్ కెరియర్..

గంగవ్వ బిగ్ బాస్ కెరియర్ విషయానికొస్తే.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తొలిసారి తన పర్ఫామెన్స్ తో అందరినీ అబ్బురపరిచింది. అయితే అక్కడ ఆరోగ్యం సహకరించక కొన్ని వారాలకే బయటకు వచ్చింది. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది కానీ ఇక్కడ కూడా ఆరోగ్యం సహకరించకనే బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ 9 లోకి కూడా వెళ్తానని, అక్కడ కూడా ఒక ఆరు వారాల పాటు ఉండి వస్తానని చెబుతోంది. మరి గంగవ్వ చెప్పిన మేరకు ఎంట్రీ ఉంటుందా? ఒకవేళ వెళ్తే మళ్లీ 5 వారాలకే బయటకొస్తుందా అన్నది చూడాలి.

ALSO READ:Bigg Boss: ఆ స్టార్ క్రికెటర్ తో పెళ్లి, పిల్లలు కూడా.. హాట్ బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ!

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×