OTT Movie : ఇప్పుడు ప్రియమణి చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఈమెకు సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.’ఫ్యామిలీ మ్యాన్’ ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. అయితే ఈ అమ్మడు ఒక హాలీవుడ్ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ రీమేక్ లో నటించింది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో కోర్ట్ రూమ్ డ్రామా ఒక మరపురాని అనుభూతిని ఇస్తుంది. తొందర్లోనే ఈ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ ఒక మహిళ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె భర్త ఒక ప్రముఖ రాజకీయవేత్తగా ఉంటాడు. అతను రాజకీయ అవినీతి, అమ్మాయిల కుంభకోణంలో చిక్కుకుని జైలుకు వెళ్తాడు. ఈ సంఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ప్రియమణి ఈ సిరీస్‌లో అలిసియా ఫ్లోరిక్ (జూలియానా మార్గులీస్) పోషించిన పాత్రను పోషించింది. ఆమె ఒక గృహిణిగా ఉంటూ, తన కుటుంబాన్ని పోషించడానికి, భర్తను కాపాడటానికి మళ్లీ న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభిస్తుంది. అసలు అమెరికన్ సిరీస్‌లో, అలిసియా ఫ్లోరిక్ ఒక స్టేట్ అటార్నీ అయిన తన భర్త పీటర్ ఫ్లోరిక్ అవినీతి కుంభకోణంలో ఇరుక్కోవడంతో, ఆమె కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది.
ఆమె గతంలో న్యాయవాదిగా పనిచేసినప్పటికీ, గృహిణిగా సంవత్సరాలు గడిపిన తర్వాత, ఆమె ఒక లా ఫర్మ్‌లో జూనియర్ అటార్నీగా మళ్లీ పని ప్రారంభిస్తుంది. ఈ సిరీస్ ఆమె వృత్తిపరమైన సవాళ్లను, కోర్టు రూమ్ డ్రామాను, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొనే భావోద్వేగాలను చూపిస్తుంది. ఈ రీమేక్ లో కూడా ప్రియమణి పాత్ర ఒక బలమైన లేయర్డ్ క్యారెక్టర్‌గా ఉంటుంది. ఆమె ఒకవైపు కుటుంబం కోసం పోరాడుతూ, మరోవైపు న్యాయ రంగంలో తన స్థానాన్ని స్థిరపరచుకుంటుంది. సంపత్ రాజ్ ఆమె భర్త పాత్రలో నటించాడు. చివరికి ప్రియమణి ఈ పోరాటంలో గెలిచిందా ? లేదా ? అనేది ఈ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఒక్క పాడు సీన్ లేదు… లవ్ స్టోరీ లేదా కమర్షియల్ కాదు… వందల కోట్లు కొల్లగొట్టిన సినిమా
జియో హాట్ స్టార్ (Jio hotStar)లో
ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘గుడ్ వైఫ్’ (Good Wife). ఈ వెబ్ సిరీస్ కు రేవతి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి, సంపత్ రాజ్, ఆరి అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ (Jio hotStar)లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలోనే స్ట్రీమింగ్ కి రానుంది. ‘The Good Wife’ 2009 లో వచ్చిన ఒక హాలీవుడ్ పొలిటికల్ డ్రామా సిరీస్. దీనిని రాబర్ట్, మిషెల్ కింగ్ సృష్టించారు. ఇప్పుడు దీని రీమేక్ లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించింది.