Balakrishna vs Naga Vamsi : తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాశం ఏంటి అంటే…? “నందమూరి బాలకృష్ణ… ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ మధ్య చెడింది” నిజానికి డాకు మహారాజ్ రిలీజ్ అయ్యే వరకు ఇలాంటిదేమీ కూడా వినిపించలేదు. కానీ, ఇటీవల అనంతపూరంలో డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ మీట్‌కు నిర్మాత అయిన నాగ వంశీ రాలేదు. దీంతో బాలకృష్ణ – నాగ వంశీ మధ్య ఏదో అయిందని, అందుకే నాగ వంశీ రాలేదని అంటున్నారు. దీనికి అనేక కారణాలు చెబుతున్నారు. అయితే వీళ్ల మధ్య గ్యాప్ పెరగడానికి ఓ ఇద్దరు కారణమని తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
సంక్రాంతికి భారీ అంచనాల మధ్య డాకు మహారాజ్ రిలీజ్ అయింది. 8 రోజుల్లోనే 156 కోట్ల కలెక్షన్లు వచ్చినట్టు పోస్టర్లు వేశారు నిర్మాతలు. ఈ కలెక్షన్ల పోస్టర్ల గురించి పక్కన పెడితే… డాకు మహారాజ్ సక్సెస్ మీట్ అయితే చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఎక్కడ అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందో… అక్కడే మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. అయితే దీనికి కోట్లాది డబ్బులు పెట్టిన నాగ వంశీ డుమ్ము కొట్టారు.
ఎన్టీఆర్ కోసమే…?
దీంతో బాలకృష్ణకు, నాగ వంశీకి ఏదో అయిందని గాసిప్స్ బయటికి వచ్చాయి. నాగ వంశీ తర్వాత చేయబోయే మూవీలో హీరో జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ – బాలకృష్ణల మధ్య ఓ చిన్న వివాదం నడుస్తున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం వల్ల బాలయ్య దగ్గర నాగ వంశీ ఉంటే తారక్‌కు నచ్చదని, అందుకే నాగ వంశీ ఈవెంట్ కు రాకుండా దూరం ఉన్నాడని ఓ గాసిప్ వచ్చింది. అయితే దీనిలో నిజం లేదని నిర్మాత నాగ వంశీ సన్నిహితులు చెబుతున్నారు.
ఐటీ రైడ్స్ ఎఫెక్ట్…?
ఎన్టీఆర్ గాసిప్‌తో పాటు మరో గాసిప్ కూడా ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నాగ వంశీ దుబాయ్‌లో ఉన్నారు. ఈ రైడ్ టైంలో ఇక్కడకి వస్తే బాగోదని నాగ వంశీ అనుకున్నాడట. ఇవే విషయాన్ని బాలయ్యకు ఫోన్ చేసి చెప్పాడని కూడా కొంత మంది నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఐటీ వాళ్లు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పై దాడి చేయాలి అని ఫిక్స్ అయితే.. నాగ వంశీ దుబాయ్‌లో ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా… దాడి చేస్తారని కొంత మంది నిపుణులు అంటున్నారు. దీంతో ఈ వార్తల్లో కూడా నిజం లేదని అనుకోవచ్చు.
చేసింది అంతా ఆ ఇద్దరే…?
అయితే బాలయ్య – నాగ వంశీ మధ్య గ్యాప్ రావడానికి ఎన్టీఆర్ సినిమా, ఐటీ రైడ్స్ ఎఫెక్ట్ ఏం కాదని అంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఓ ఇద్దరి వల్లే బాలయ్య – నాగ వంశీ మధ్య చెడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వస్తుంది. ఆ ఇద్దరి మాటలు వినడం వల్లే… డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌కు నాగ వంశీ హాజరు కాలేదట.
బాలయ్య అభిమానులు ఫైర్…
నాగ వంశీ ఎందుకు రాలేదు అనే విషయాన్ని పక్కన పెడితే.. బాలయ్య అభిమానులు మాత్రం ఫైర్ మోడ్‌లో ఉన్నారు. కనీసం సినిమా ప్రమోషన్స్ కి రాలేని నిర్మాతతో సినిమా చేయడం వద్దు అని బాలకృష్ణను రిక్వెస్ట్ చేస్తున్నారు.