Virat Kohli: న్యూజిలాండ్ పై సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం తర్వాత భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు బ్యాటింగ్ లో విఫలం కావడంతో మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆటగాళ్లంతా దేశవాళి క్రికెట్ లో పాల్గొనాలని బీసీసీఐ నిబంధన విధించింది. ఇటీవల రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ లు మొదలయ్యాయి.
Also Read: Australian Open 2025: జకోవిచ్ కు ఎదురుదెబ్బ.. ఫైనల్‌కు అలెగ్జాండర్ జ్వెరెవ్.. !
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భారత స్టార్ క్రికెటర్లు రంజీలో బరిలోకి దిగారు. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా భారత జట్టు ఆటగాళ్లందరూ దేశవాళి క్రికెట్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశవాళి క్రికెట్ లో సందడి చేయబోతున్నాడు. కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడబోతున్నాడు.
ఢిల్లీ తరపున ఆడేందుకు విరాట్ కోహ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జనవరి 30 నుండి రైల్వేస్ తో జరిగే కీలకమైన రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగబోతున్నాడు. గత కొంతకాలంగా కోహ్లీ రంజీలలో ఆడతాడా..? లేదా..? అనే ఊహాగానాలు వినిపించాయి. మెడ కండరాల నొప్పి కారణంగా అతడు రంజీల్లో పాల్గొనడం లేదనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఈ ఊహగానాలకు తెరదించుతూ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాడు విరాట్ కోహ్లీ.
ఢిల్లీ జట్టు జనవరి 23 న సౌరాష్ట్రతో తలపడింది. అయితే కోహ్లీ మాత్రం తన సొంత గడ్డపై జరిగే రైల్వేస్ తో మ్యాచ్ నుండి జట్టుతో కలవబోతున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ, ఢిల్లీ కోచ్ శరన్ దీప్ సింగ్ అధికారికంగా ఖరారు చేశారు. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012 నవంబర్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన మ్యాచ్ లో రంజి ఆడాడు. 2011లో టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత విరాట్ కోహ్లీ ఆడింది కేవలం ఒక్క రంజీ మ్యాచ్ మాత్రమే.
Also Read: Indian Players: టీమిండియాలో కల్లోలం.. ఒకేసారి విడాకులు తీసుకోనున్న ముగ్గురు ప్లేయర్లు ?
అంటే దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజి ట్రోఫీలో ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కోహ్లీ ఆడబోయే రంజీ మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఈ నెల 30వ తేదీన అరుణ్ జైటి స్టేడియంలో రైల్వేస్ తో జరగబోయే మ్యాచ్ ని ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చు. ఈ నిర్ణయం పట్ల క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
🚨 GREAT NEWS FOR VIRAT KOHLI FANS 🚨
– The Entry for Delhi vs Railways Ranji Trophy match at Arun Jaitley stadium is free for all. King Kohli returns to Ranji Trophy, starting from 30th January. pic.twitter.com/vuxNT2hOnK
— Tanuj Singh (@ImTanujSingh) January 24, 2025