BigTV English

Daaku MahaRaj Story : డాకు మహారాజ్ కథ ఇదే… ఈ స్టోరీతోనే హిట్ కొట్టాలని అనుకున్నారా..?

Daaku MahaRaj Story : డాకు మహారాజ్ కథ ఇదే… ఈ స్టోరీతోనే హిట్ కొట్టాలని అనుకున్నారా..?

Daaku MahaRaj Story : డాకు మహారాజ్ మూవీ… సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌కి గట్టి పోటీ ఇచ్చే మూవీ అని అందరూ నమ్ముతున్నారు. జనవరి 14న రిలీజ్ కాబోయే ఈ మూవీపై హోప్స్ గట్టిగానే ఉన్నాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా బాగానే ఉందని టాక్ వచ్చింది. ఇది మంచి ఓపెనింగ్స్ కు యూజ్ అవుతుంది. అయితే ఈ ట్రైలర్ బాగున్నా… సినిమా దేని గురించి ఉందో అనే టాపిక్ ను మాత్రం రివీల్ చేయలేదు మేకర్స్. అయితే డాకు మహారాజ్ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. స్టోరీని ట్రైలర్‌లో కనిపించకుండా కట్ చేశారట. మరీ డాకు మహారాజ్ స్టోరీ ఏంటి…? డాకు గా ఉన్న బాలయ్య మహారాజ్ ఎలా అయ్యాడు..? అనేవి ఇప్పుడు చూద్ధాం..


డైరెక్టర్ బాబీ నుంచి వచ్చిన లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత బాబీ మరోసారి సంక్రాంతి బరిలో ఉన్నాడు. ఈ సారి బాలయ్యతో సంక్రాంతికి వస్తున్నాడు. ఈ నెల 14న డాకు మహారాజ్ మూవీ థియేటర్స్ లోకి వస్తుంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్‌గా కట్ చేయడంతో మూవీపై ఇప్పటికైతే పాజిటివ్ టాక్ ఉంది. అయితే ట్రైలర్‌లో సినిమా దేని గురించి ఉంటుంది అనే టాపిక్ ను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఇండస్ట్రీలో ఒకటి వినిపిస్తుంది.


దీని ప్రకారం… మంచి నీటి కోసం యుద్ధం..

ఈ సినిమాలో బాలయ్య ఓ బందిపోటు. అంటే డబ్బు ఉన్న వాళ్ల నుంచి దోచి.. పేద ప్రజలకు పంచి పెడుతాడు. అయితే తాను సాయం చేస్తున్న ఓ గ్రామానికి మంచి నీటి సమస్య వస్తుందట. అక్కడ ఉండే మంచి నీటి సోర్స్ ను విలన్ అయిన బాబీ డియోల్ స్వాధీనం చేసుకోవడంతో ఆ గ్రామ ప్రజలు నీరు లేక చనిపోతారు. దీంతో డాకు అయిన బాలకృష్ణ… విలన్‌తో మంచి నీటి కోసం పెద్ద యుద్ధమే చేస్తారట.

డాకు అంటే… నీటి కోసం దొంగల కాకుండా దోరల ఫైట్ చేస్తాడు అని కొన్ని డైలాగ్స్ కూడా సినిమాలో ఉంటాయని సమాచారం.

ఓ గ్రామం కష్టాల్లో ఉంటే హీరో ఆ గ్రామం కోసం పోరాటం చేయడం అనే కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే…. ఇది రోటీన్ స్టోరీనే. అయితే, ఇక్కడ బాబీ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సరికొత్తగా మూవీ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే బాలయ్య అభిమానులు యాక్సెప్ట్ చేసేలా భారీ యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో కనిపిస్తాయట. అయితే ఈ యాక్షన్ సీన్స్ ఓవర్ లోడ్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వస్తుంది. అలాగే సినిమాలో కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ఇలా మొత్తంగా ఈ సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చేలా, గేమ్ ఛేంజర్ మూవీకి గట్టి పోటీని ఇచ్చేలా డాకు మహారాజ్ మూవీ ఉంటుందని తెలుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×