Ghaati Glimpse : టాలీవుడ్ జేజేమ్మ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అరుంధతి లాంటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాల తర్వాత అడపా దడపా సినిమాలతో వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక చివరగా అనుష్క గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ అందుకుంది తాజాగా మరో రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసింది. ఆ సినిమాల్లో ఒకటి ‘ ఘాటి ‘.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యు.వి. క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఈ మూవీ నుంచి అనుష్క బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక తాజాగా మరో సర్ ప్రైజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో అనుష్క చాలా కోపంగా కనిపిస్తుంది. ఆవేశంలో ఉన్న ఆమె చేతిలో చుట్ట పట్టుకొని కనిపిస్తుంది. ఆ వీడియోలో అనుష్క ను చూస్తుంటే అరుంధతిని మళ్లీ చూసినట్లు కనిపిస్తుంది. ఆ వీడియోలో అనుష్క చాలా కోపంగా కనిపిస్తుంది. ఆ వీడియోలో అనుష్క చాలా కోపంగా కనిపిస్తుంది. అతి కిరాతకంగా తలను నరుకుతుంది. ఆ తలను చేత పట్టుకొని తిరుగుతుంది. చివరిలో చుట్ట కాలుస్తుంది. అక్కడితో వీడియో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోను చూసిన అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇది కదా కోరుకొనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సినిమా పై అంచనాలను పెంచేస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అనుష్క లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయ్యండి..
ఇక పాన్ ఇండియా చిత్రమిది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’తో అనుష్క పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. హిందీలోనూ క్రిష్ సినిమాలు తీశారు. అందువల్ల, ఈ సినిమా మీద జాతీయ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు అందరి చూపు పడుతోంది.. ఇక సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటుగా కథాకర్ అనే మరో సస్పెన్స్ సినిమా లో నటిస్తుంది. ఆ మూవీ నుంచి మోషన్ పోస్టర్ ను మేకర్స్ అనుష్క బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది అనుష్క నుంచి 4 సినిమాలను ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చునని తెలుస్తుంది..