Sunita Williams : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని.. సంబంధిత వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె ఫోటోలు, వీడియోలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందంటున్నారు. ఇటీవల దీపావళి సందర్భంలోనూ, అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసినప్పుడు సునీతా విలియమ్స్ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిలో ఆమెను చూసిన వారికి బాగా చిక్కిపోయినట్లుగా కనిపిస్తోంది. దాంతో.. ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సునీతా ఫోటోలు చేస్తే తెలుస్తుంది.
ఫోటోల్లో సునీతా విలియమ్స్ బుగ్గలు పూర్తిగా లోపలికి వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నీరసంగా, ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని వైద్యులు సైతం అంగీకరిస్తున్నారు. అక్కడి పరిస్థితులు విలియమ్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాని చెబుతున్నారు. శరీర బరువు ఎక్కువగా కోల్పోయినప్పుడే.. బుగ్గలు అలా లోపలికి కుచించుకుపోతాయి.
అంతరిక్షంలో శరీరాన్ని సున్నా గురుత్వాకర్షణకు సర్దుబాటు చేయడానికి, శరీరానికి కావాల్సిన వెచ్చదనాన్ని అందించేందుకు.. శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. ఆ కారణంగానే.. సాధారణ పరిస్థితులతో పోల్చితే.. అంతరిక్షంలో ఎర్ర రక్త కణాల ఉత్పుత్తి తగ్గిపోతుంది. అలా.. శరీరానికిి కావాల్సిన ఆక్సిజన్ సర్దుబాటు అవుతుంటుంది. దీనినే.. స్పేస్ ఎనీమియా అంటుంటారు. ప్రస్తుతం.. సునీతా, విల్మోర్.. ఇదే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాట్లు చెబుతున్నారు.
అంతరిక్షంలో అంత సులభం కాదు
అంతరిక్షంలో మానవ శరీర పరిస్థితులు వేరుగా ఉంటుంటాయి. అక్కడ కండరాలు, ఎముకల ద్రవ్యరాశి వేగంగా కోల్పోతుంటాయి. ఈ కారణంగానే.. ప్రతీ వ్యోయగామి రోజుకు దాదాపు 2.5 గంటల పాటు వ్యాయామం చేయిస్తుంటారు. అలాగే.. ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండడం వల్ల మానసిక ఆరోగ్యం సైతం బాగా క్షీణిస్తుంటుంది. తన పర్యటన తర్వాత ఎలా సాగుతుందో తెలియని ఆందోళన, ఎప్పుడు భూమి మీదకు తిరిగి వస్తామో తెలియన స్థితిలో ఆమెలో మానసిక ఒత్తిడి పెరిగిపోయేందుకు ఆస్కారం ఉందంటున్నారు వైద్యులు. పైగా.. ఎక్కువ రోజులు, తక్కువ స్పేస్ లో ఉండడమూ ఒత్తిడికి కారణమవుతుందని అంటున్నారు.
వారికి వైద్య పరీక్షలు అవసరం
ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 200 రోజులకు పైగా గడిపిన నలుగురు వ్యోమగాములు క్రూ – 8 ద్వారా భూమి పైకి తిరిగి వచ్చారు. వారిని నాసా వైద్య పరీక్షలకు పంపించింది. వారికి అన్ని వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. ఒకరికి వైద్య సాయం అవసరమని తేల్చింది. కానీ.. కొన్ని రోజులకే మిగిలిన ముగ్గురిని కూడా ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. అంతరిక్షంలో వారి ఆరోగ్యం దెబ్బతినడంతో వారికి వైద్య సాయం అందిస్తున్నారు. ఇప్పుడు.. సునీతా విలియమ్స, బుట్ విల్మోర్ ల ఆరోగ్యం కూడా ఈ తీరుగానే దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రమాదం ఏం లేకపోవ్చు.
అయితే.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ల ఆరోగ్యాలకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదని అంటున్నారు.. వైద్యులు. ప్రస్తుతానికి వారికి కావాల్సిన ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించారని చెబుతున్నారు. పరిమిత వనరుల కారణంగా.. అక్కడ తక్కువ ఆహారం ఇస్తుంటారు. అదే.. ఆమె అలా కనిపించడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నామన్న వైద్యులు.. మరింత కాలం అక్కడే ఉంటే మాత్రం సునీతా, విల్మోర్ ల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
అసలేం జరిగింది.
బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) ఈ ఏడాది జూన్ 5న చేరుకున్నారు. 8 రోజుల పాటు వీళ్లు అక్కడ పరిశోధనలు చేయాలనేది మొదట అనుకున్న ప్రణాళిక. కానీ.. అక్కడి చేరుకున్న తర్వాత స్టార్ లైనర్ లో… హీలియన్ లీకేజీ కారణంగా.. థ్రస్టర్ విఫలం అయినట్లు గుర్తించారు. దాంతో.. తిరుగు ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు రద్దు చేశారు. దాంతో.. వీరిద్దరు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా రు. అవి విజయవంతం అయ్యే వరకు.. వారిద్దరూ అక్కడ ఉండాల్సిందే.