Devi Sri Prasad Vs Nagavamsi:సినీ ఇండస్ట్రీలో ఏ ఇద్దరి సెలబ్రిటీల మధ్య అయినా మనస్పర్ధలు సహజమే. అయితే అవి ఎందుకు మొదలయ్యాయి? ఎక్కడ మొదలయ్యాయి? అనే విషయం తెలుసుకుంటే మనస్పర్ధలు ఉండవు. అయితే ఎదుటి వ్యక్తితో తిరిగి మాట్లాడాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు, కచ్చితంగా సమస్యను సాల్వ్ చేసుకునే దిశగా అడుగు వేస్తారు. ఒకవేళ ఆ ఆలోచన లేకపోతే సంవత్సరాల తరబడి ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అలాగే ఉండిపోతే, కలిసి సినిమాలు కూడా చేయని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నాగవంశీ (Naga Vamsi), స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని సమాచారం. మరి ఎందుకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి? ఏ కారణంగా వచ్చాయి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
నా సినిమాలకు దేవీని పెట్టుకోను – నాగ వంశీ..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా గత రెండు దశాబ్దాల నుంచి మంచి విజయాలను అందిస్తూ దూసుకుపోతున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించినప్పటికీ, ‘సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్’ లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఆయన చేయలేకపోయాడు. దీనికి కారణం ఏంటి అంటే? నిర్మాత నాగ వంశీ తో విభేదాలు రావడం వల్లే వీరి కాంబినేషన్లో సినిమాలు రావడం లేదు అనే ఒక వార్త తెరపైకి వచ్చింది. దీనికి తోడు నాగ వంశీ కూడా బాలకృష్ణ(Balakrishna )హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్ ‘ సినిమా క్యూ అండ్ ఏ సెషన్ లో భాగంగా ఒక రిపోర్టర్ బాబి(Bobby) ని ఉద్దేశిస్తూ.. “మీ గత సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా దేవిని పెట్టుకున్నారు కదా.. మరి ఈ సినిమాకెందుకు తమన్ ను తీసుకున్నారు? ” అనే ఆ ప్రశ్నకు నాగ వంశీ మాట్లాడుతూ..” నేను దేవిశ్రీప్రసాద్ ను నా సినిమాలకు పెట్టుకోను.ఎక్కువగా తమన్ అయితేనే నా సినిమాలకు కరెక్టుగా ఉంటాడు. కాబట్టి ఆయననే తీసుకుంటాను. అది పూర్తిగా నా నిర్ణయమే” అంటూ నాగ వంశీ తెలిపాడు. ఇక దీంతో ఈ విషయాలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఈ విషయాలు విన్న నెటిజన్స్ మాత్రం.. సినిమా ఇండస్ట్రీలో ఈగోలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక సినిమాకి ఎవరైతే అవసరమో.. ఎవరైతే మంచి అవుట్ పుట్ ఇస్తారో.. వారిని మాత్రమే పెట్టుకుని సినిమా సక్సెస్ చేసుకోవాలి. కానీ కోపంతో టాలెంట్ ఉన్న వారిని తీసేయడం, టాలెంట్ లేకపోయినా మనవాళ్లు అనే ప్రేమతో పెట్టుకోవడం లాంటివి చేస్తే నష్టం వస్తుంది. ఈ విషయాన్ని గమనిస్తే అందరికీ మంచిది అని ట్రేడ్ పండితులు అలాగే నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.