BigTV English
Advertisement

Gods on Screen: తెరపై దేవుళ్లు.. ప్రస్తుత ట్రెండ్ ఇదేనా?

Gods on Screen: తెరపై దేవుళ్లు.. ప్రస్తుత ట్రెండ్ ఇదేనా?

Powerful Fantasy Movies Gods on Screen now Trending: మామూలుగా హీరోలంటే అభిమానులకు దేవుళ్లే.. హీరోలకి అభిమానులు, ఆడియెన్స్‌.. ప్రేక్షకుల దేవుళ్లు.. ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపించే మాటలే. కానీ ఇప్పుడు దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాల మీద సినిమాలు తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. సోషియో ఫాంటసీ చిత్రాలకు గిరాకీ పెరిగింది.


దేవుడ్ని తెరపై అలా ఒక్కసారి చూపించినా కూడా సినిమాకు కలెక్షన్లు మోతమోగిపోతోన్నాయి. గతేడాది వచ్చినా ‘అఖండ’ని తీసుకున్నా.. ‘హనుమాన్‌’ను తీసుకున్నా.. రీసెంట్‌గా వచ్చిన ‘కల్కి’ని తీసుకున్నా కూడా ఇప్పుడంతా ఏ ట్రెండ్ నడుస్తోందో చెప్పాల్సిన పని లేదు. దైవ భక్తిని చాటే చిత్రం, దేవుడి శక్తిని చూపించేలా కథ, కథనాలతో ఓ సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే.

అలాంటి కొన్ని చిత్రాలు ఇంకా టాలీవుడ్‌లో లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే ‘అఖండ 2’ కూడ రాబోతోంది. ఇప్పటికే కథ ఓ కొలిక్కి రావడంతోపాటు షూటింగ్ సైతం మొదలుపెట్టేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ప్రభాస్ హీరోగా ‘కల్కి 2’ ఎలాగూ వస్తోన్న విషయం తెలిసిందే.


ఇదిలా ఉండగా, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి’ కూడా రాబోతోంది. సూపర్ హిట్ ఫిల్మ్ పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ తీసిన ఈ అరి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో కృష్ణుడిదే మెయిన్ పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకు ఎవరు టచ్ చేయని అరి షడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ చివరిలో కృష్ణుడ్ని చూపించే సీన్‌కు గూస్ బంప్స్ ఖాయమని సమాచారం.

Also Read: రికార్డుల మీద రికార్డులు.. షారుఖ్‌ను వెనక్కి నెట్టి ప్రభాస్.. ఇదేక్కడి మాస్ రా మావా..!

అలాగే వచ్చే ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీ సోషియో ఫాంటసీ అన్న సంగతి తెలిసిందే. ఇంకా జై హనుమాన్ సెట్స్ మీద ఉంది. నిఖిల్ స్యయంభు, కార్తికేయ 3లు కూడా దైవ భక్తి చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. ఇలా ప్రతీ సినిమా దేవుళ్ల కథలకు ఆధారంగా తెరకెక్కుతున్నాయి. ఇటీవల మహాభారతం ఆధారంగా ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇలా దేవుడి కథలపై తీసిన సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘అఖండ 2’, జై హనుమాన్, కల్కి 2 వంటి సినిమాలు మళ్లీ బాక్సాఫీసు వద్ద దేవుడి మహత్యం చూపించనున్నాయి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×