BigTV English

Indian Embassy Advisory: వర్సిటీల్లో ఘర్షణలు, భారతీయులకు ఎంబసీ సలహా

Indian Embassy Advisory: వర్సిటీల్లో ఘర్షణలు, భారతీయులకు ఎంబసీ సలహా

Indian Embassy Advisory: బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు అక్కడ యూనివర్సిటీలు రణ రంగంగా మారుతున్నాయి? పరిస్థితి అదుపు తప్పిందా? అక్కడి ఘర్షణల్లో ఎంతమంది చనిపోయారు? ఎందుకు అక్కడి భారతీయులకు రాయబారి కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది? పరిస్థితి శృతి మించు తోందా? ఇలా రకరకాల ప్రశ్నలకు చాలామందిని వెంటాడుతున్నాయి.


బంగ్లాదేశ్‌లోని వివిధ యూనివర్సిటీల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లలో కొత్త విధానం తీసుకురావాలన్నది ప్రధాన డిమాండ్. ప్రతిభకు పట్టం కట్టాలని కోరుతూ అక్కడి యూనివర్సిటీలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఘర్షణలకు దారి తీసింది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ఈక్రమంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు.

ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. పరిస్థితి గమనించిన బంగ్లాదేశ్‌‌లోని భారతీయ రాయబారి కార్యాలయం ఓ అడ్వైజరీని జారీ చేసింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని, తగ్గించుకోవాలని సూచన చేసింది. భారత కమ్యూనిటీకి చెందిన ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం వెంటనే హైకమిషనర్ సంప్రదించాలని పేర్కొంది.


భారత కమ్యూనిటీకి చెందిన ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నది అందులోని ప్రధాన పాయింట్. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే హైకమిషనర్ సంప్రదించాలని, 24గంటల ఎమర్జెన్సీ నెంబర్లను విడుదల చేసింది.

అసలు వివాదం ఏంటి? 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో మరణించిన వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉంది. 10 శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10 శాతం మహిళలకు, ఐదు శాతం మైనార్టీ తెగలకు అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ పద్దతిని మార్చాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రోడ్డు ఎక్కారు.

ALSO READ: అమెజాన్ ఫారెస్టులో అరుదైన తెగ, మాస్కో పైరోగా గుర్తింపు.. తొలిసారి

బంగ్లాదేశ్‌లో ముఖ్యమైన సిటీలు ఢాకా, రాజ్‌షాహి, ఖుల్నా, చత్తోగ్రాల్లో యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపు నిచ్చారు. రోజురోజుకూ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దీనికి ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆరుగురు మృతి చెందగా వందల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు కాలేజీలు, స్కూల్స్, మదర్సాలను మూసి వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు తెరవద్దని సూచన చేసింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×