BigTV English

Kerala Traffic Rule:కేరళలో ఇదేం ట్రాఫిక్ రూల్ స్వామీ? తిడుతున్నారు అంతా

Kerala Traffic Rule:కేరళలో ఇదేం ట్రాఫిక్ రూల్ స్వామీ? తిడుతున్నారు అంతా

Kerala traffic police new rule to bike riders(Latest telugu news): మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ పాడుకుంటూ కొందరు బైక్ రైడింగ్ ఎంజాయ్ చేస్తుంటారు. రోడ్డు మీద ఫ్లయిట్ నడిపినట్లుగా ఫీలవుతూ రయ్ మని వెళుతుంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతలా వాహనదారులను కంట్రోల్ చేసినా రూల్స్ అతిక్రమిస్తునే ఉంటారు. చలాన్లు కట్టుకుంటూనే యథాప్రకారం వాహనాలను అడ్డగోలుగా డ్రైవ్ చేస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంటాయి. జనం ఇబ్బందులు పడుతున్నా పోలీసులకు కావలసింది రోడ్డు సేఫ్టీ. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిబంధనలు విధిస్తుంటారు.


వాహనదారులకు అవగాహన

ప్రతి ఏడాదీ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పిస్తుంటారు. కేరళలోనూ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు పరుస్తున్నారు అక్కడి పోలీసులు. అయితే అత్యుత్సాహంతో కొన్ని నిబంధనలు తీవ్ర విమర్శలపాలవుతున్నాయి. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలతో సహా డబుల్స్ రైడింగ్ సమయంలో వెనక కూర్చొన్న వ్యక్తితో మాట్లాడకూడదని ఓ సరికొత్త నిబంధన విధించారు. దారి పొడవునా అలా మాట్లాడుతూ వెళుతూ తమ ఏకాగ్రత కోల్పోతున్నారని..వాహనంపై ప్రయాణించేటప్పుడు అలా మాట్లాడేవారి వలన ఎదుటివారికి కూడా ప్రమాదమే అంటున్నారు కేరళ ట్రాఫిక్ పోలీసులు.


జరిమానాలు వద్దు అవగాహన ముద్దు

కేవలం రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ఇలాంటి నిబంధనలంటూ సమర్థించుకుంటున్నారు. లాంగ్ డ్రైవింగ్ చేయాల్సివచ్చినప్పుడు అస్సలు మాట్లాడకుండా ఎలా ఉంటామని అడుగుతున్నారు వాహనదారులు. ఇక ఇంటికి వచ్చేదాకా వెనక కూర్చొన్న వ్యక్తితో మాట్లాడకుండా ఎలా ప్రయాణిస్తాం అని వాపోతున్నారు వాహనదారులు. అయితే జరిమానా ఎంత విధిస్తే బాగుంటుంది అనేది ఇంకా నిర్ణయించలేదని అంటున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుని పక్కాగా అమలు చేస్తామని అంటున్నారు కేరళ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ జరిమానాల బదులు వారికి అవగాహన కల్పిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులపై ఫైర్

అలాంటి అవగాహన కార్యక్రమాలతో వాహనదారులలో మార్పు రాదని..కేవలం జరిమానాలు విధిస్తే గానీ వాహనదారులు మాట వినరని పోలీసులు వాదిస్తున్నారు. కొత్తగా విధించిన ఈ నిబంధనపై కేరళ ప్రజలు పోలీసుల తీరుపై విరుచుకుపడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలలోనూ ఇలాంటి నిబంధనలు అమలైతే కష్టమే..తెలుగువారు మాట్లాడకుండా ప్రయాణించలేరు. ఫైనులు కట్టడానికైనా రెడీ గానీ మాట్లాడొద్దంటే మా వల్ల కాదంటారు మనవాళ్లు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×