Gopichandh Malineni :నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య ఒకరు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయనని ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ బాలకృష్ణ చేశారు. వైవిద్యమైన కథలకు స్వాగతం పలికారు. అయితే ఒక టైం లో మాస్ కమర్షియల్ సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ఇక రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ ఎంతటి ఫామ్ లో ఉన్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్యకాలంలో వరుస డిజాస్టర్లు తో సతమతమవుతున్న టైంలో అఖండ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుని ఇప్పుడు వరుస హిట్ సినిమాలను చేస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది గెస్ట్ లు ఈ షో కి హాజరయ్యారు. ఈ షో కి హోస్ట్ నందమూరి బాలకృష్ణ అని చెప్పినప్పుడు చాలామంది అనేక విమర్శలు చేశారు. అసలు బాలకృష్ణ హోస్ట్ ఏంటి అని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. బాలయ్య నిజమైన వ్యక్తిత్వం ఏంటో ఈ షో ద్వారా బయటపడింది. బాలయ్య ఎదుటివారిని ఎలా గౌరవిస్తారో ఎంత సరదాగా మాట్లాడుతారు ఈ షో చూసిన తర్వాత అర్థమైంది.
వరుస హిట్ సినిమాలు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను బీభత్సంగా ఎలివేట్ చేసింది. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వరుస హిట్ సినిమాలు బాలయ్య కెరియర్ లో పడ్డాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన వీర సింహారెడ్డి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా మంచి ఫలితాన్ని నమోదు చేసుకుంది. బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకుమహారాజు సినిమా కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
నెక్స్ట్ లెవెల్ సినిమా
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈసారి బాలకృష్ణతో చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్ గోపీచంద్ మలినేని. ఈ మధ్యకాలంలో బాలకృష్ణని డ్యూయల్ క్యారెక్టర్ లో చూపించడం చాలామంది దర్శకులు అలవాటు చేసుకున్నారు. మీరు అలా చూపించకుండా చేస్తారా అని అడిగినప్పుడు అది కథను బట్టి ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. వీర సింహారెడ్డి సినిమాలో డబల్ రోల్ లో చూసినప్పుడు, యంగ్ రోల్ నాక్కూడా కొంచెం డల్ అనిపించింది. ఈసారి అలా కాకుండా కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తా అంటూ ఇన్ డైరెక్ట్ గా డ్యూయల్ రోల్ ఉంటుంది అన్నట్లే చెప్పుకొచ్చాడు.
Also Read : Surya SonOf Krishnan : ఇది కేవలం సినిమా మాత్రమే కాదు – వెంకీ అట్లూరి