Gopichand: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో గోపీచంద్ ఒకరు. తొలివలపు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్. అయితే ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో విలన్ పాత్రలో కనిపించి ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వర్షం సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించాడు. మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వం వహించిన నిజం సినిమాలో కూడా విలన్ గా కనిపించాడు. అయితే విలన్ గా ప్రూవ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత హీరోగా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు గోపీచంద్.
గోపీచంద్ చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇకపోతే ఇప్పటివరకు గోపీచంద్ కెరియర్ లో ఒక విషయంలో కూడా రిమార్క్ అంటూ లేదు అని చెప్పాలి. బేసిగ్గా ప్రతి హీరోకి నెగిటివ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు కానీ గోపీచంద్ కు మాత్రం అలా లేరు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. చాలామందితో గోపీచంద్ కి మంచి అనుబంధం ఉంది. గోపీచంద్ వ్యక్తిత్వాన్ని చాలామంది ఎంతగానో ఇష్టపడతారు. ఇకపోతే గోపీచంద్ సినిమాలు కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా మంచి కాన్సెప్ట్ ఎన్నుకున్నాడు అని ప్రశంసలు మాత్రం పొందాడు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు గోపీచంద్ తన కెరియర్ లో చేశాడు. గోపీచంద్ కమర్షియల్ సక్సెస్ సాధించి చాలా ఏళ్లయింది. గోపీచంద్ ఇప్పుడు మరో కొత్త దర్శకుడు కి అవకాశం ఇవ్వనన్నట్లు తెలుస్తుంది. కుమార్ అనే ఒక కొత్త దర్శకుడు గోపీచంద్ కు కథ చెప్పారట. ఇప్పటివరకు గోపీచంద్ ఆ జోనర్లో సినిమా కూడా చేయలేదు అని తెలుస్తుంది. కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే ఈ సినిమాను ఎస్ వి సి సి బ్యానర్ పైన బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే అవకాశం ఉంది.
గోపీచంద్ కెరియర్లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ ఉంటాయి. చివరగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన విశ్వం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొంతమేరకు పరవాలేదు అని అనిపించుకుంది. గోపీచంద్ ఒక కొత్త దర్శకుడు కి అవకాశం ఇవ్వనున్నారు అని తెలియగానే చాలామంది ఎందుకు అంత సాహసం ఒక మంచి డైరెక్టర్ తో సినిమా చేసి మంచి సక్సెస్ కొట్టొచ్చు కదా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏదైనా కొత్త డైరెక్టర్లతో పని చేయడం కూడా మంచి విషయమే, ఎందుకంటే నానికి చాలామంది కొత్త దర్శకులు హిట్ సినిమాలు ఇచ్చారు అలానే గోపీచంద్ కూడా కొత్త దర్శకులతో పని చేస్తే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పొచ్చు.
Also Read: భాస్కర్ ఐడియా మాత్రమే కాదు… దాని వెనక నేను కూడా ఉన్నాను…