Siddhu Jonnalagadda: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన సిద్దు ఆ తర్వాత హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ సిద్దుకి మంచి స్టార్డం తీసుకొచ్చిన సినిమా అంటే డీజే టిల్లు అని చెప్పాలి. ఈ సినిమా కేవలం హీరోగానే కాకుండా రచయితగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది సిద్దుకి. సిద్ధులో ఇంత గొప్ప రైటర్ ఉన్నాడా అని ప్రూవ్ చేసింది ఆ సినిమా. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇదివరకే వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం నటులు మాత్రమే కాకుండా మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. విశ్వక్సేన్ లాంటి వాళ్లు దర్శకత్వం కూడా చేస్తున్నారు.
సిద్ధూ లో ఉన్న రచయిత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు టిల్లు క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం చూస్తేనే సిద్దు టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది. ఇక ప్రస్తుతం సిద్దు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమాలు సిద్దు ఇన్వాల్వ్మెంట్ ఏ రేంజ్ లో ఉంది అని ప్రశ్నించగా.. ఈ సినిమా ఒరిజినల్ క్యారెక్టర్ ను బొమ్మరిల్లు భాస్కర్ క్రియేట్ చేశారు నా ఇన్వాల్వ్మెంట్ ఇంపర్వైసేషన్ కచ్చితంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో ఉన్న ఒక ఫేమస్ డైలాగ్ కూడా తాను ఇంపర్వైసేషన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు సిద్దు. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య జంటగా నటిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
బొమ్మరిల్లు భాస్కర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన పరుగు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ సినిమా అప్పట్లో ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ రీ రిలీజ్ లో మాత్రం ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో చివరిగా హిట్ అందుకున్న భాస్కర్ ఈ సినిమాతో ఏ స్థాయి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి. ఇదివరకే భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఒక పాత్రలో కనిపించాడు. ఇప్పుడు కంప్లీట్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు అంటే ఇది సిద్దు సక్సెస్ కి నిదర్శనం అని చెప్పొచ్చు.
Also Read: SS Rajamouli : ఛీ ఛీ… మొత్తం నాశనం చేస్తున్నారు… వాళ్లపై జక్కన్న తీవ్ర అసహనం