BigTV English
Advertisement

Best Web Series: ఏం ఎలివేషన్ ఇచ్చారు భయ్యా వీడికి.. ఆ సీన్ చూస్తే గూజ్‌బంప్సే, బలంతో కాదు బుద్ధితో కొడతాడు!

Best Web Series: ఏం ఎలివేషన్ ఇచ్చారు భయ్యా వీడికి.. ఆ సీన్ చూస్తే గూజ్‌బంప్సే, బలంతో కాదు బుద్ధితో కొడతాడు!

కండ బలం గొప్పదా? బుద్ధిబలం గొప్పదా? అంటే మనం వెంటనే కండ బలం అని చెప్పేస్తాం. కానీ, మనిషికి రెండూ ముఖ్యమే. బుద్ధిని ఉపయోగిస్తూ.. కండ బలాన్ని ప్రదర్శిస్తే దానికో అర్థం ఉంటుంది. కాదని మూర్ఖంగా కండబలాన్నే నమ్ముకుంటే.. చివరికి ఏమవుతుందనేది.. ఈ ముగ్గురు స్నేహితుల కథ చెబుతుంది.


ఇటీవల Netflixలో విడుదలైన Weak Hero – Class 1 వెబ్ సీరిస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరిస్ హిందీలో అందుబాటులో ఉంది. యూత్ యాక్షన్ డ్రామా జోనర్స్ ఇష్టపడేవారికి ఈ సీరిస్ బాగా నచ్చుతుంది. ఓ కొరియా పాపులర్ వెబ్ టూన్ స్టోరీ ఆధారంగా ఈ సీరిస్‌ను తెరకెక్కించారు. స్కూల్ లైఫ్‌లో బుల్లీయింగ్ (ర్యాంగింగ్) వల్ల విద్యార్థులు ఎంతగా సఫర్ అవుతున్నారనేది ఈ సీరిస్‌లో చూడవచ్చు. చివరికి మంచి మిత్రులు కూడా శత్రువులుగా మారి ప్రాణాలు తీసే స్థాయికి ఎలా మారతారనేది ఈ సీరిస్‌లో చూడవచ్చు. ఈ సీరిస్ మార్చి 25 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్. ఒక్కసారి స్టార్ట్ చేస్తే.. ఆపడం కష్టమే. ఇక కథలోకి వెళ్తే..

కథ:


‘వీక్ హీరో క్లాస్ 1’ కథ యాన్ సీ-యున్ (పార్క్ జీ-హూన్) అనే టాప్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. క్లాస్‌లో ఎవరితో మాట్లాడడు. కేవలం చదువే అతడి ప్రపంచం. అందుకే.. ఆ క్లాస్‌లో కొంతమందికి అతడు నచ్చడు. ఎప్పుడూ మూడీగా, ఏదో కోల్పోయినట్లు కనిపిస్తాడు. ఎవరి జోలికి వెళ్లడు. బయటకు అతడు చాలా సైలెంట్‌గా, బలహీనంగా కనిపిస్తాడు. కానీ, అతడి తెలివి, ధైర్యమే హీరోగా నిలబెడతాయి. ఓ రోజు సి-యున్‌ను తన క్లాస్ మేట్ బుల్లీంగ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఒక డ్రగ్ ఇచ్చి.. పరీక్ష రాయనివ్వకుండా చేస్తాడు. ఆ తర్వాత రోజు సి-యున్ నిజస్వరూపం చూడాల్సి వస్తుంది. తన పెన్, పుస్తకాన్ని ఆయుధంగా మలచుకొని.. తనకు డ్రగ్స్ ఇచ్చిన విద్యార్థులను చితకబాదుతాడు. అదే ఈ కథకు కీలక మలుపు. ఈ క్రమంలోనే సి-యున్‌కు.. ఆన్ సూ-హో (చోయ్ హ్యూన్-వూక్), ఓహ్ బీమ్-సియోక్ (హాంగ్ క్యుంగ్) అనే ఇద్దరు స్నేహితులు తోడవుతారు. వారికి ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో ఎదుర్కొంటారు. కానీ, సమస్యలు క్రమేనా కఠినంగా మారుతాయి. సి-యున్ ఇద్దరు స్నేహితుల్లో ఒకరు.. శత్రువుగా మారతాడు. అతడి వల్ల మరో స్నేహితుడు కోమాలోకి వెళ్లి చావు బతుకులతో పోరాడతాడు. మరి సి-యున్.. శత్రువుగా మారిన ప్రాణ స్నేహితుడిపై రివేంజ్ తీర్చుకుంటాడా? చివరికి ఏమవుతుందనేది ఈ సీరిస్ చూసే తెలుసుకోండి.

విశ్లేషణ:

కొరియా సీరిస్‌లు క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెగ్యులర్‌గా చూసేవారికి వారి నటన అలవాటు అవుతుంది. అప్పుడప్పుడు చూసేవారికి కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ సీరిస్‌లో ఉన్న కుర్రాళ్లు కొన్ని సీన్లలో జీవించారు. ఇందులోని భావోద్వేగ సన్నివేశాలు హత్తుకుంటాయి. స్నేహితుల మధ్య ఉండే ఆ బాండ్‌ను చాలా చక్కగా చూపించారు. సి-యున్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అయితే.. కథనం చాలా స్లోగా ఉంటుంది. కథలోకి వెళ్లడానికి టైమ్ పడుతుంది. అలాగే.. సి-యున్ అంత మూడీగా ఉండటానికి కారణం ఏమటనేది కొన్ని ఎపిసోడ్స్ తర్వాత తెలుస్తుంది. అయితే, ప్రధాన పాత్ర అంత డల్‌గా కనిపించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ, కథాపరంగా అది అవసరం. అందుకే.. ఈ సీరిస్ టైటిల్ ‘వీక్ హీరో’. దానికి తగినట్లే అతడి క్యారెక్టర్ ఉంటుంది. కొన్ని సీన్లకు గూజ్‌బంప్స్ రావడం పక్కా.

Also Read: మనుషులు, చెట్ల డీఎన్ఏతో మానవ జాతిని అంతం చేసే కొత్త క్రియేచర్

రెండవ సీజన్ కూడా రెడీ..

ఈ సిరీస్ సాధారణ హైస్కూల్ డ్రామాలకు భిన్నంగా ఉంటుంది. బుల్లీయింగ్ కఠిన వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ముఖ్యంగా సీ-యున్ తన బుద్ధితో శత్రువులను ఎదుర్కొనే తీరు ఆకట్టుకుంటుంది. ఈ బ్రెయిన్ యాక్షన్ శైలి కొత్తగా అనిపిస్తుంది. దీనికి కొనసాగింపుగా 2వ సీజన్ కూడా సిద్ధమవుతోంది. పార్క్ జీ-హూన్ తన నటనతో సీ-యున్ పాత్రకు ప్రాణం పోశాడు. అతని ఎమోషనల్ డెప్త్, నిశ్శబ్దంలోని శక్తి సిరీస్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. చోయ్ హ్యూన్-వూక్, హాంగ్ క్యుంగ్ కూడా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. సహాయ పాత్రల్లో లీ యాన్ (యంగ్-యీ), షిన్ సియుంగ్-హో (జియోన్ సియోక్-డే) కూడా తమ నటనతో మెప్పించారు.

Weak Hero Class 1 Trailer

Tags

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×