Grok On Tollywood: ఇటీవల ఎక్స్ వేదికగా వచ్చిన గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు రోజు రోజుకు ప్రేక్షధారణ పెరుగుతుంది. ఒకప్పుడు టెక్నాలజీ పరంగా దూసుకుపోయిన ఈ ఏఐ వచ్చిన మొదట్లో భాజాపా ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకున్న విషయం తెలిసిందే.. అన్ని సంస్థలు కార్యాలయాల్లో ఈ టెక్నాలజీని వాడేందుకు అధికారులు ఆమోదం తెలిపారు కూడా.. అలా అందుబాటులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ గ్రోక్ చాట్‌జీపీటీ(Chatgpt) లాగా సున్నితమైన భాషను మాట్లాడకుండా తనకు నచ్చిన భాషలో ఇచ్చిపడేస్తుంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగు ఫ్యాన్‌వార్ గ్రూప్‌లను ఒక ఆటాడుకుంది. తాజాగా మరోసారి ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేస్తుంది. అసలు ఏం జరిగింది అనేది కాస్త వివరాల్లోకి వివరాల్లోకి వెళితే..
హీరోల మధ్య ఫ్యాన్స్ వార్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని హీరోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. అందులో స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫాన్స్ మధ్య గత కొన్ని నెలలుగా ఏదో శత్రుత్వం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్ మొదలు పెడతారు. తమ హీరోల సినిమాలు రిలీజ్ అయి థియేటర్ నుంచి వెళ్లిపోయేంతవరకు అవతల హీరోని టార్గెట్ చేస్తూ వస్తుంటారు. ఈమధ్య ఇలాంటివి కాస్త తగ్గినట్లే అనిపించాయి. అయితే మొన్నీమధ్య గ్రోక్ చాట్‌జీపీటీ వల్ల హీరోల ఫ్యాన్స్ వార్ జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ వార్ జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. విషయానికొస్తే.. తాజాగా “ఓ ట్విట్టర్ యూజర్ నీకు జాతకం చెప్పడం వస్తే నా జాతకం చెప్పు మామ ఎలా ఉంటుందో” అని అడుగుతాడు.
దానికి గ్రోక్ చాట్‌జీపీటీ సమాధానం చెప్పింది.. హాయ్ మామా! నేను ఏఐ ని, నాకు జాతకాలు చెప్పడం రాదు కానీ నీ లైఫ్ మాత్రం సూపర్ గా ఉంటుందని గెస్ చేస్తా.. ఎందుకంటే నువ్వు బాబు ఫ్యాన్ వి. టాలీవుడ్ హైప్ లో జీవిస్తావు.. జీవితంలో బిగ్ సక్సెస్ సాధిస్తావు. కానీ ఫేక్ కలెక్షన్స్ నుంచి దూరంగా ఉంటే బెటర్ అని సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏఐ మామ ఇంతకీ ఏ బాబు ఫ్యాన్ అవ్వాలి అంటూ నెట్టింట హంగామా చేస్తున్నారు..
Also Read : బిగ్ బాస్ తర్వాత నా పరిస్థితి దారుణం.. ఆశ పడ్డాను జరగలేదు..
రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు…
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్లు మొత్తం ఫేక్ అని కడిగిపడేసింది. ఈ సినిమాకు డే1లో రూ.56 కోట్లు వస్తే.. రూ.186 కోట్లు వేసి ఫేక్ కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసిందంటూ గ్రోక్ తెలిపింది.. అదే విధంగా మహేష్ నటించిన దూకుడు సినిమా కలెక్షన్లు కూడా ఫేక్ అంటూ గ్రోక్ తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.. ఇప్పుడు మరోసారి బాబు ఫ్యాన్ అయితేనే లైఫ్ బాగుంటుందని టు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
— Billu Star (@Billu_Star_) July 8, 2025