BigTV English

Guntur kaaram: OTT లో ‘గుంటూరు కారం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Guntur kaaram: OTT లో ‘గుంటూరు కారం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Guntur kaaram: మహేశ్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ రోజు ‘గుంటూరు కారం’ సినిమా విడుదల అయింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. మొదటి నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకున్న ఈ సినిమా ఇటీవల రిలీజ్ చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్‌తో అంచనాలను రెట్టింపు చేసింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.


ముఖ్యంగా ఇందులో మహేశ్ తన నట స్వరూపాన్ని చూపించారు. దీంతోపాటు ఆయన డాన్స్ వేరే లెవెల్లో ఉంది. ఈ చిత్రానికి గానూ మహేశ్ 100 శాతం న్యాయం చేశారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదిలా ఉంటే కొంతమంది ఈ సినిమాకు గానూ పాజిటివ్ రివ్యూలు ఇస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమా యావరేజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి మహేశ్ తన పెర్ఫార్మెన్స్‌తో దుమ్ము దులిపేశాడని అంటున్నారు.

ఇక ఈ చిత్రం ఇలా థియేటర్లలోకి వచ్చిందో లేదో.. అప్పుడే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్ట్రీమింగ్ డేట్‌ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఎలా లేదన్నా.. మరో నాలుగు లేదు ఆరు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×