BigTV English

Donald Trump: ట్రంప్ పై రివర్స్ ఎటాక్!.. దెబ్బకు దిగొస్తాడా!!

Donald Trump: ట్రంప్ పై రివర్స్ ఎటాక్!.. దెబ్బకు దిగొస్తాడా!!

Donald Trum: సీతయ్య ఎవరి మాటా వినడని మనకు తెలుసు కదా! అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అలాంటోడే. గట్టిగా మాట్లాడితే.. అంతకుమించినోడే! ట్రంప్ ఎవ్వరినీ లెక్క చేయడు. ఆయన లెక్క ఆయనకు ఉంటుంది. అందుకోసమే.. అగ్రరాజ్యాధినేతగా అతను తీసుకునే ప్రతి నిర్ణయం ఓ సంచలనం. ప్రెసిడెంట్‍‌‍‌‌గా పగ్గాలు చేపట్టాక.. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాల ఆగ్రహానికి కారణమవుతున్నాయ్. ఇదంతా అమెరికా కోసమేనని చెబుతున్నా.. అక్కడి జనం ఒప్పుకోవట్లేదు. పైగా.. ట్రంప్ మీదే మండిపడుతున్నారు. అమెరికా వీధుల్లో నిరసనలు చూశాక ఒకటే అనిపించింది.. ట్రంప్‌పై తిరుగుబాటు మొదలైందా? అని! అగ్రరాజ్యంలో ఎగసిపడ్డ ఆందోళనలు దేనికి సంకేతం?


ట్రంప్ నిర్ణయాలు జనానికి చిర్రెత్తిస్తున్నాయా?

అమెరికా ఒక్కసారిగా భగ్గుమంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయ్. రిపబ్లికన్ పార్టీ పాలనా తీరుపై అగ్రరాజ్యం ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రెసిడెంట్ ట్రంప్ తీరును నిరసిస్తూ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన అతి పెద్ద నిరసన ఇదే.


50 రాష్ట్రాల్లో 1200లకు పైగా ప్రాంతాల్లో ర్యాలీలు..

హ్యాండ్స్ ఆఫ్ పేరుతో వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 50 రాష్ట్రాల్లో 1200లకు పైగా ప్రాంతాల్లో జరిగిన ఈ ర్యాలీలు.. అమెరికా చరిత్రలోనే ఓ అరుదైన సంఘటనగా నిలిచాయ్. నిరసనలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారి.. మొత్తం వరల్డ్ అటెన్షన్‌ని గ్రాబ్ చేశాయ్. కార్మిక యూనియన్లు, పౌర హక్కుల సంఘాలు, స్వలింగ సంపర్క సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్ల లాంటి 150 సంఘాలు చేపట్టిన ఈ హ్యాండ్సాఫ్ నిరసనలకు జనం వెల్లువెత్తారు.

ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, ప్రజా సేవల్లో కోత

అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి లేటెస్ట్ టారిఫ్‌ల విధింపు వరకు ప్రతి నిర్ణయం, ప్రతి విధానంపై.. అమెరికా అంతటా వేలాది మంది జనం రోడ్ల మీదికొచ్చి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, ప్రజా సేవల్లో కోత, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కులు, వివాదాస్పద సామాజిక విధానాలపై.. అన్ని రకాల గ్రూపులు, సంస్థలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాయ్.

ఫెడరల్ ఏజెన్సీల్లో భారీ కోతలపైనా తీవ్ర వ్యతిరేకత

ముఖ్యంగా.. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో నిరసనలు ఉద్ధృతంగా సాగాయి. ప్రజాస్వామ్య సంస్థలను ట్రంప్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఇక.. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్‌.. ఫెడరల్ ఏజెన్సీల్లో విధిస్తున్న భారీ కోతలపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్రయత్నాలన్నీ పన్ను చెల్లింపుదారులకు బిలియన్లకొద్దీ డాలర్లు ఆదా చేస్తుందని చెబుతున్నా.. చాలా మంది అమెరికన్లు ఈ చర్యలను సమర్థించడం లేదు. ముఖ్యమైన సేవలను నిర్వీర్యం చేస్తున్నట్లుగానే చూస్తున్నారు.

హెల్త్ కేర్ నిధులకు కోత విధించడంపైనా జనం మండిపాటు

మరోవైపు.. సామాజిక భద్రతా కార్యాలయాల మూసివేత, ఉద్యోగుల తొలగింపు, హెల్త్ కేర్ నిధులకు కోత విధించడంపైనా జనం మండిపడుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ మేక్స్ అమెరికా స్ట్రాంగ్ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రెసిడెంట్ ట్రంప్, ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రపంచానికే సవాల్ విసురుతున్నాయని, వలసదారుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంటోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రపంచాన్నే ఆర్థికమాంద్యంలోకి నెట్టబోతున్నాడనే నినాదాలు వినిపించాయి.

ట్రంప్ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి!

2017 తర్వాత.. అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి. అమెరికా వ్యాప్తంగా సాగిన ఈ ఆందోళనలు, జనం నుంచి వ్యక్తమైన ఆగ్రహావేశాలు.. ట్రంప్ పాలనపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని స్పష్టంగా చాటాయి. నిరసనకారులంతా.. తమ డిమాండ్లని బలంగా వినిపిస్తూ.. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ వీడియాలు, సందేశాలు వైరల్‌గా మారాయి. దాంతో.. ఈ ఉద్యమం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read: ఇదెందయ్య.. పదవి అన్నది పెత్తనం తమ్ముడిది

అమెరికాలో పౌర సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం

ప్రజల అవసరాలతో పనిలేకుండా ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తోందనే చర్చ అమెరికాలో మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని.. ఉద్యోగాల్లో భారీ కోతలతో అమెరికాలో సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం పడుతోందనే ఆందోళన జనంలో ఉంది. విద్య, సామాజిక భద్రత, మెడికేర్, మాజీ సైనికు హక్కులు సహా ఏదీ సవ్యంగా లేవంటున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లపైనా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేకమంది అమెరికన్లు కూడా ఈ విషయంలో ఆగ్రహంగానే ఉన్నారు. అయినాసరే.. ఈ నిరసనల్ని వైట్ హౌజ్ తోసిపుచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రజల ఆందోళనలపై చర్చ

ప్రెసిడెంట్ ట్రంప్ ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయని.. అర్హులైన పౌరుల సామాజిక భద్రత, ఆరోగ్య సాయాననికి ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపింది. ఏదేమైనా.. అమెరికా ప్రజలు రోడ్లపైకి వచ్చి తెలిపిన నిరసనలు.. కేవలం ట్రంప్ విధానాలపైనే కాదు.. అమెరికా రాజకీయ వ్యవస్థలోని లోతైన విభేదాలని కూడా బయటపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రజల ఆందోళనలపై చర్చ జరుగుతోంది. దాంతో.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు.. ప్రెసిడెంట్ ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు.. అమెరికా భవిష్యత్ ఏ దిశగా సాగుతుందనేది కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×