A. M. Rathnam : ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలు భారీ ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతల్లో ఒకరు ఏఎం రత్నం.. శ్రీ సూర్య మూవీస్ అనే బేనర్ కనిపిస్తే చాలు.. ఆ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడేవి. కర్తవ్యం, భారతీయుడు, స్నేహం కోసం, ఖుషి లాంటి భారీ విజయాలతో నిర్మాతగా వైభవం చూశారాయన. ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ పరిమితులను ఏమాత్రం పట్టించుకోకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీసేవారాయన.. కథ ఆయనకు నచ్చితే మాత్రం ఆ సినిమా కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టగల సత్తా కలిగిన నిర్మాత. ప్రస్తుతం తెలుగులో హరిహర వీరమల్లు సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈయన ఆరోగ్యం సరిగ్గా లేదన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతమైన తీవ్రమైన జ్వరంతో అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. జ్వరం ఎక్కువగా ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనను అబ్జర్వేషన్ లోంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఆయన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..
నిర్మాతకు తీవ్ర అస్వస్థత..
ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.. గత రెండు రోజులుగా ఆయనకు తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. ప్రస్తుతం జ్వరం ఎక్కువగా ఉండడంతో ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలుస్తుంది.. ప్రత్యేకమైన వైద్య బృందం నేత్రుత్వంలో ఆయనను ఉంచినట్లు మీడియా సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు ఆయనను ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.. ఆయన హెల్త్ బులిటెన్ గురించి డాక్టర్లు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Also Read :ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 21 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
ఏఎమ్ రత్నం సినిమాలు..
టాలీవుడ్ లో నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించారు.. ఎలాంటి నిర్మాతకైనా నిలకడగా విజయాలు సాధించడం కీలకం. అవి లేకే రత్నం కూడా వెనుకబడిపోయారు. ముఖ్యంగా తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమాలన్నీ ఆయన్ని దారుణంగా దెబ్బ కొట్టాయి.. వేరే సినిమాలు లేక ఆయన సినిమాలను నిర్మించడమే మానేశాడు. కొద్ది రోజులుగా ఆయన ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు.. మళ్లీ ఆయన చాలా గ్యాప్ తర్వాత మొదలుపెట్టిన పెద్ద సినిమా.. హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం దయానందరెడ్డి అనే భాగస్వామిని కూడా తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరో.. క్రిష్ దర్శకుడు.. పైగా పీరియడ్ స్టోరీ.. ఇంకేముంది బాక్సాఫీస్ బద్దలే అనుకున్నారంతా. సినిమా మొదలైనపుడు, టీజర్ వచ్చినపుడు హైప్ మామూలుగా లేదు.. ఈ విడుదల వాయిదా పడటంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదట్లో ఉన్నంత క్రేజ్ ఇప్పట్లో లేదని అర్థమవుతుంది. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే ఆయన ఖాతాలో మళ్లీ భారీ బడ్జెట్ సినిమా పడినట్లే..