Gundeninda GudiGantalu Today episode May 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు గురించి తెలుసుకోవాలని రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య నిన్ను నేను సొంత అన్నయ్య లాగా అనుకున్నాను.. కానీ మీరు కూడా ఇలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదంటూ మీనా అంటుంది.. గుణకు క్యాబ్ డ్రైవర్లు డబ్బులు ఇవ్వాలని, వాడితో పాటు శివ వచ్చి డబ్బులు అడగటంతో గొడవ అయ్యిందని, అందుకే బాలు కారు అమ్మేసి మరి డబ్బులు కట్టాడని మీనాకు చెబుతాడు. దాంతో మీనా నేరుగా గుణ దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. తన భర్త తలుచుకుంటే నీకు బతుకు ఉండదని హెచ్చిరిస్తుంది. ఇంకోసారి తన తమ్ముడిని వెంట పెట్టుకొని తిరగొద్దని వార్నింగ్ ఇస్తుంది.
ఇక మనోజ్ కు అప్పు ఇచ్చిన పార్క్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతాడు. అతని చూడగానే మనోజు షాక్ అవుతాడు. మీరేంటి ఇంటికొచ్చారు. బయటికి వెళ్లి మాట్లాడుకుందాం పదండి బ్రో అనేసి మనోజ్ ఎంత బ్రతిమలాడినా అతను వినడు అప్పుడే రోహిణి వచ్చి ఎవరు మనోజ్ అని అడుగుతుంది. నేను చెప్తాను సిస్టర్ మనోజ్ కి నేను డబ్బు ఇచ్చాను అప్పుగా కాదు వడ్డీ తో సహా తీసుకుంటానని చెప్పాను. మనోజ్ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదని అంటాడు. పాపం జాబు లేదు కదా ఎలా తీరుస్తాడు. అందుకే నేను ఇంటికి వచ్చేసాను మీరేనా ఇవ్వండి సిస్టర్ అని అతను రోహిణి తో అంటాడు. ఇంతకీ నువ్వు అప్పు చేసిన డబ్బులు లేవని మనోజ్ ని అడిగితే అది బాలు తీసుకున్నాడు కదా అని అంటాడు. రోహిణి ఇంకేం మాట్లాడకుండా చీకొట్టి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మౌనికను ఇంట్లో నుంచి పంపించేసి కొత్త పెళ్లి చేసుకోవాలని సంజయ్ అనుకుంటాడు. ప్లాన్ ప్రకారం ఫ్రెండ్స్ నీ ఇంటికి తీసుకొచ్చి మందు పొయ్యమని అడుగుతాడు. మందులోకి నంచుకోవడానికి మెనూని చెప్తాడు. అవన్నీ చేసుకొని వెళ్ళిన మౌనికను డ్రైవర్తో అక్రమ సంబంధం ఉంది అంటూ అంట కట్టేసి బాధ పెట్టేస్తాడు. తర్వాత రోజు ఉదయం మౌనిక ఇంట్లో కనిపించకపోతే సంజయ్ నీలకంఠం సంతోషపడతారు. ప్రభావతి మౌనిక తో మాట్లాడాలని ఫోన్ చేస్తుంది. ఇంకా విషయం తెలియదు అనుకుంటాను అందుకే కూల్ గా మాట్లాడుతుంది అని సంజయ్ అనుకుంటాడు. ఇక లేదు అత్తయ్య ఎక్కడికో వెళ్ళింది అని చెప్తాడు ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మౌనిక ఎక్కడికి వెళ్ళింది బాబు అంటూ ప్రభావతి అడుగుతుంది అలాగే సంజయ్ వాళ్ళమ్మ కూడా మౌనికను వెతికి ఇంటికి తీసుకురావాలని డిమాండ్ చేస్తుంది.
బాలు ఆటోలో ఒక వ్యక్తిని ఎక్కించుకొని ఓ పార్టీ ఆఫీస్ దగ్గర దిగబెడతారు. అయితే అక్కడే తన ఫ్రెండ్ అశోక్ ని కలుసుకుంటాడు.. ఇది నువ్వేంటి రా ఎక్కడున్నావని ఇద్దరూ మంచి మర్యాదల గురించి మాట్లాడుకుంటారు. ఆఫీస్ అక్కడ్నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాడ్రా అందుకే నేను ఇక్కడే ఉంటున్నాను అని అతను అంటాడు. అయినా నువ్వు కార్లో రావాల్సిన వాడివి ఇలా ఆటోలో వచ్చావ్ ఏంటి అని తన ఫ్రెండ్ అడిగితే.. కారు పోయిందిరా అందుకే ఇలా ఆటోలో రావాల్సి వచ్చింది అని అంటాడు. అయితే నువ్వు పార్టీలోకి వస్తే నీకు మీ ఏరియాలో పలుకుబడి ఉంది కదా ఖచ్చితంగా కార్పొరేటర్ అవుతావని సలహా ఇస్తాడు.
రాజకీయాలకు రుచు లాంటివి రా నాకు మాత్రం అస్సలు వద్దు నాకు ఈ ఆటో అనేది బాగుందే రాజకీయాలకు రుచు లాంటివి రా నాకు మాత్రం అస్సలు వద్దు నాకు ఈ ఆటో అనేది బాగుందే అనేసి బాలు అంటాడు అనేసి బాలు అంటాడు. ఇక తన ఫ్రెండ్ అశోక్ లోపల అన్నకు పరిచయం చేస్తాను పదా అనేసి తీసుకుని వెళ్తాడు. అయితే లోపలికి వెళ్లగానే అశోక్ పై ఆ ఎమ్మెల్యే అరుస్తాడు. 250 మందికి సామూహిక వివాహాలు జరపాలని అనుకున్నాం కదా ఇంకా ఎక్కడ వక్కే ఉన్నాయి ఇందుకే ఆ జంటలు వస్తారా రారా అని అరుస్తూ ఉంటాడు. కచ్చితంగా వస్తారన్న అని అశోక్ అంటాడు. కానీ అశోక్ కి ఓ ఫోన్ వస్తుంది పూలదండలు తీసుకునేవాడు పక్కింటి అమ్మాయితో లేచిపోయాడంటూ చెప్పడంతో ఆ ఎమ్మెల్యే ఇంకాస్త కోపంగా రెచ్చిపోతాడు.
మొత్తానికైతే అశోక్ వల్ల ఆ ఆడరు మీ నాకు వెళుతుంది. ఈ విషయాన్ని ఎలాగైనా మీ నాకు చెప్పాలని అనుకుంటాడు. సత్యంని పెట్టి మీ నాకు అసలు విషయాన్ని చెప్తాడు. ఒక్కొక్క దండ 500 రూపాయలు అనడంతో బాలు షాక్ అవుతాడు. రోజుల్లో 500 దండలు కావాలంటే మేన నావల్ల కాదు అని మొదట అంటుంది తర్వాత నా మాట పోతుందని బాలు అనగానే బస్తీలోని మందిని పెట్టుకొని చేస్తాను నాకు ముందు అడ్వాన్స్ కావాలని డిమాండ్ చేస్తుంది. తనకి బాలు అడ్వాన్స్ ఇవ్వడంతో మీనా ఆ ఆర్డర్ ని తీసుకుంటుంది.
నేను గుడికి వెళ్లి దండం పెట్టుకుని సుమతీ దగ్గరికి వెళ్లి బస్తీలోని వాళ్ళని పూలను కట్టడానికి పూల మాలలు కట్టాలి అని చెప్పాలి అని మీనా అంటుంది. అయితే మౌనిక కోసం సంజయ్ ఊరంతా వెతుకుతూ ఉంటాడు. అక్కడే ఉన్న బాలు వీడు ఎవరికోసమో వెతుకుతూ ఉన్నాడు కదా అని అనుకుంటాడు. సంజూ దగ్గరికి బాలు వెళ్లి ఎవరికోసమో వెతుకుతున్నారు కదా అదేదో నాకు చెప్పండి. ఏరియా నాకు బాగా తెలుసు నేను అడ్రస్ గురించి చెప్తానని అంటాడు కానీ సంజయ్ మాత్రం అడ్రస్ దొరక్కపోతే నేను ఇంటికైనా వెళ్తాను గాని నిన్ను మాత్రం అడగను అంటూ అరుస్తాడు.. బాలు ఒకతని పట్టుకొని ఆ అతను అడుగుతున్న అడ్రస్ ఏంటో చెప్తారని అడుగుతాడు.
డ్రెస్ గురించి కాదండి ఒక అమ్మాయి ఫోటో చూపించి ఎక్కడికో వెళ్ళిపోయింది అంట అమ్మాయిని చూశారా అని అడుగుతున్నాడని బాలుకు. అది విన్న బాలు కోపంతో రగిలిపోతాడు.. అయితే బాలు నేరుగా ఇంటికి వెళ్లి నా చెల్లెలికి ఏమైందని అడుగుతాడు. అటు మౌనిక గుడిలో తనకెందుకు ఈ కష్టాలంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మౌనికని చూసిన మీనా ఏమైందని అడుగుతుంది. మీనాకు మౌనిక అబద్ధం చెప్తుంది. ఇక తర్వాత బాలు సంజయ్ మెడ మీద కత్తి పెట్టి నా చెల్లెలు ఎక్కడ అని అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..