Switzerland: ప్రళయం క్రమంగా మొదలైందా? పుడమిపై జరుగుతున్న వరుస ఘటనలు దేనికి సంకేతం? స్విట్జర్లాండ్‌లోని ఓ గ్రామం భూస్థాపితం కావడానికి కారణమేంటి? కేవలం 40 సెకన్లలో మట్టిలో కలిసిపోయింది ఓ గ్రామం. ప్రళయమా? మానవ తప్పిందా? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
స్విట్జర్లాండ్‌లోని బ్లాటెన్ గ్రామంపై హిమానీనదం విరుచుకుపడింది. ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లోని సంభవించిన ప్రకృతి పకోపానికి అందమైన స్విస్ గ్రామం రెప్పపాటులో భూస్థాపితం అయ్యింది. కేవలం 40 సెకన్లలో మట్టిలో కలిసిపోయింది ఆ గ్రామం. 90శాతం గ్రామమంతా మట్టిలో కలిసిపోయింది. ఈ ఘటనలో ఒకరు మిస్సయినట్టు తెలుస్తోంది.
ఇలాంటి ఘటనలు జరుతాయని స్విచ్ ప్రాంతాలకు ముందే తెలుసా? బిర్క్ గ్లేసియర్‌లో కదలికలను ముందే పసిగట్టింది స్థానిక యంత్రాంగం. కొద్దిరోజులకు ముందే ఆ గ్రామంలోని దాదాపు 300 మంది స్థానికులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. దీంతో పెను ప్రమాదం తప్పింది లేకుంటే లేకుంటే జరిగే నష్టాన్ని అంచనా వేయలేమని అంటున్నారు.
ప్రస్తుతం ఆరుపదులున్న ఓ వృద్ధుడి జాడ కనిపించలేదని స్థానిక మీడియా వెల్లడించింది. హిమానీ నదాలు ఇంకా పడే ఛాన్స్ ఉందని స్థానిక అధికారుల మాట. పర్వతం పైనుంచి జారి కొచ్చిన మట్టి పెళ్లలతో కిందనున్న లోన్జా నదిలో ఊహించని అలజడి రేగింది. దీంతో దిగువనున్న ప్రాంతాలను నదీ జలాలు ముంచెత్తనున్నాయి.
ALSO READ: అమెరికా కోర్టులో ఇండియా, పాక్ వార్నన ట్రంప్ మామూలోడు కాదు
మరోవైపు ఘటన జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం స్విట్జర్లాండ్ అధ్యక్షుడు కరెన్ కెల్లర్ సూటర్ పర్యటించనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్విస్ టెలివిజన్‌లో ప్రసారమయ్యారు. గ్లేసియర్ దాటికి దట్టమైన ధూళి మేఘాలు గాలిలోకి ఎగిశాయి. గ్రామంపై బిర్చ్ హిమానీనదం ముంచెత్తడంతో ఆ ప్రాంతమంతా కకావికలమైంది.
ఇళ్ళు, నిర్మాణాలు, లోన్జా నది ప్రాంతాలోని కొన్ని భాగాలు విధ్వంసక ప్రవాహానికి దారితీసింది. హిమానీ నదాలు అస్థిరత సంకేతాల కారణంగా మే నెల ఆరంభం లోయలోని గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని, ఈసారి ఊహించని విధంగా వచ్చిందని అంటున్నారు.
ఘటన జరిగిన తర్వాత రెస్క్యూ బృందాలు రంగంలో దిగేశాయి. థర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్లు ఆ ప్రాంతమంతా మోహరించాయి. ఇలాంటి హిమానీ నదాల వరదలు వచ్చే ప్రమాదం ఉందని భావించిన అధికారులు, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 1.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల హిమానీనదం కూలిపోవడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని ప్రాంతీయ ప్రభుత్వం ధృవీకరించింది.
కొద్దిరోజులకు ముందు బిర్చ్ హిమానీనదం రోజుకు 8 నుండి 11 అడుగుల వేగంతో కదులుతున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దాదాపు 9 మిలియన్ టన్నుల శిథిలాల కింద ఆ గ్రామం పూర్తి కూరుకుపోయిందని అంటున్నారు. ఇప్పటికే పశువులను, గొర్రెలు, పెంపుడు కుందేళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీ నదాలను కదలడానికి కారణంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎక్కువ హిమానీ నదాలకు నిలయం స్విట్జర్లాండ్. ఆ గ్రామంలో ఎప్పటి మాదిరిగా పునరుద్ధరణకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేమన్నారు. ఆధ్యాత్మిక వ్యక్తుల వెర్షన్ మరోలా ఉంది. ప్రళయం మొదలైందని, రానున్నరోజుల్లో తీవ్రమవుతుందని అంటున్నారు.
భారీగా విరుచుకుపడిన మంచు కొండలు.. స్విస్ గ్రామం భూస్థాపితం!
ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లోని అందమైన స్విస్ గ్రామం రెప్పపాటులో భూస్థాపితం
స్విట్జర్లాండ్‌లోని లోట్స్‌చెంటర్ లోయ ప్రాంతంలోని బ్లాటెన్ గ్రామంపై విరుచుకుపడిన మంచు కొండలు
భారీస్థాయిలో మట్టిదిబ్బలు ఒక్కసారిగా పడటంతో… pic.twitter.com/k4UVGJhrAn
— BIG TV Breaking News (@bigtvtelugu) May 30, 2025