Kannada Hero Darshan: మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండేవారిపై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ అనేవి సహజం. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే యాక్టర్ల రోజు గడవడం కష్టం. కానీ అలాంటి నెగిటివ్ కామెంట్స్‌నే సీరియస్‌గా తీసుకున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. తనపై, మరో నటిపై నెగిటివ్ కామెంట్స్ చేసినందుకు రేణుకా స్వామి అనే ఒక కామన్ మ్యాన్‌ను స్కెచ్ వేసి మరీ హత్య చేయించాడని తనపై కేసు నమొదయ్యింది. అదే విషయంపై గత కొన్నిరోజులుగా ఆయన జైలుశిక్ష కూడా అనుభవిస్తున్నాడు. తాజాగా మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చిన దర్శన్ నుండి తనకు ప్రాణహాని ఉందని ఒక లాయర్ రోడ్కెక్డాడు. తనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.
బెదిరింపులు మొదలయ్యాయి
రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడిగా దర్శన్ (Darshan) జైలుకు వెళ్లినప్పటి నుండి తనను చాలామంది చాలా రకాల మాటలు అన్నారు. సినీ సెలబ్రిటీలు సైతం దర్శన్ చేసిన పనిపై విమర్శలు కురిపించారు. అలాంటి వారిలో కన్నడ టీవీ ఆర్టిస్ట్, బిగ్ బాస్ ఫేమ్‌తో పాటు లాయర్ అయిన జగదీష్ కూడా ఒకరు. దర్శన్ జైలులో ఉన్నంతకాలం తనపై ఎన్నో కామెంట్స్ చేశారు జగదీష్. ఇక దర్శన్ ఎప్పటికీ బయటికి రాడని అనుకున్నాడేమో ఏమో.. అప్పట్లో అలాంటి కామెంట్స్ చేసి.. ఇప్పుడు అలా చేసినందుకు భయపడడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా దర్శన్ వల్ల తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మరో సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
Also Read: మీరు హిందువులని మర్చిపోయారా.? దీపికా, రణవీర్ కూతురి పేరుపై నెటిజన్ల ఆగ్రహం
1000 ఫోన్ కాల్స్
హీరో దర్శన్ వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు జగదీష్. ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. దర్శన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన అభిమానులంతా జగదీష్‌ను టార్గెట్ చేశారట. అంతే కాకుండా ఏకవచనంతో దూషిస్తున్నారని కూడా ఆయన వాపోయాడు. నేరుగా తన కుటుంబానికే ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన బయటపెట్టాడు. ఇప్పటికీ దర్శన్ అభిమానుల నుండి వారి కుటుంబానికి దాదాపు 1000కు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని జగదీష్ తెలిపారు. దర్శన్.. తనను ఒక్కసారి కూడా సంప్రదించలేది కానీ తన అభిమానుల బెదిరింపుల వెనుక దర్శన్ హస్తం కచ్చితంగా ఉందని జగీదీష్ ఆరోపిస్తున్నారు.
ఇన్నాళ్లకు బెయిల్
ప్రస్తుతం దర్శన్‌పై ఆరోపణలు చేస్తూ జగదీష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే దర్శన్ మరోసారి అదే తప్పు చేస్తున్నాడా లేక ఇది కేవలం తన అభిమానుల పనేనా అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. చాలాకాలంగా దర్శన్.. జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. తనపై కేసు నమోదయినప్పటి నుండి తన తరపున లాయర్లు.. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోయింది. ఇటీవల అనారోగ్య సమస్యలు ఉన్నాయనే కారణం చెప్పడంతో కోర్టు.. తనకు ఆరువారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకుంది. అలా నవంబర్ 1న జైలు నుండి బయటికి వచ్చాడు దర్శన్.