BigTV English

This Week Releases: ఈవారం విడుదల కానున్న సినిమాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవే.. కే విశ్వనాథ్ చివరి చిత్రానికి ఎక్కువ కట్స్

This Week Releases: ఈవారం విడుదల కానున్న సినిమాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవే.. కే విశ్వనాథ్ చివరి చిత్రానికి ఎక్కువ కట్స్

This Week Releases: ఈవారం ఎన్నో చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలకు సంబంధించిన సెన్సార్ సెర్టిఫికెట్స్ అన్నీ తాజాగా బయటికొచ్చాయి. వాటిపై ఓ లుక్కేయండి..


కల్లు కంపౌండ్ 1995

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరెకెక్కే సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టం. నేచురల్‌గా విలేజ్ నేటివిటీని చూపిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్టే. అలాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన చిత్రమే ‘కల్లు కంపౌండ్ 1995’. అక్టోబర్ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. ప్రవీణ్ జెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గణేష్ డీఎస్ హీరోగా నటించాడు. తాజాగా ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇందులో ఒక పాటలో లిక్కర్ తాగడం వల్ల వచ్చే నష్టాలకు సంబంధించిన లిరిక్స్‌ను సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. ఒక వైలెన్స్ సీన్‌కు సంబంధించిన నిడివి తగ్గించింది, రాజీవ్ గాంధీ పదాన్ని మ్యూట్ చేసింది.


Kallu Compound 1985 Censor Certificate
Kallu Compound 1985 Censor Certificate

ఇద్దరు

జేడీ చక్రవర్తి, అర్జున్.. ఈ ఇద్దరూ ఒకప్పుడు ఎంతో స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోలు.. గత కొంతకాలంగా తెరపై ఎక్కువగా కనిపించడం లేదు. అలాంటి ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రమే ‘ఇద్దరు’. ఇది కే విశ్వనాథ్ నటించిన చివరి సినిమా కావడం విశేషం. ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ‘ఇద్దరు’.. ఇన్నాళ్ల తర్వాత అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ ఈ మూవీకి ఏకంగా 19 సెన్సార్ కట్స్ ఉన్నాయి. చాలావరకు పాటల్లోని లిరిక్స్‌ను, డైలాగ్స్‌లోని మాటలను డిలీట్ చేసింది. అసలు అవసరం లేని విషయాలను కూడా సెన్సార్ ఎందుకు కట్ చేసిందా అని మూవీ టీమ్‌లో చర్చలు నడుస్తున్నాయి.

Iddaru Censor Certificate
Iddaru Censor Certificate

రివైండ్

తెలుగులో అతి తక్కువ బడ్జెట్‌తో ఒక సైఫై థ్రిల్లర్ సినిమా వచ్చి చాలాకాలమే అయ్యింది. అలాంటి సినిమానే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘రివైండ్’. అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సాయి రోనక్, అమృత చౌదరీ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ చక్రవర్తి దీనిని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో సెన్సార్ ఎక్కువగా కట్స్ ఏమీ చేయలేదు. ఒక బూతు పదాన్ని తొలగించమని చెప్పింది. అంతే కాకుండా డ్రగ్స్ వినియోగం కనిపించినప్పుడు వార్నింగ్ చూపించమని ఆదేశించింది.

Rewind Censor Certificate
Rewind Censor Certificate

ది డీల్

ఈవారం విడుదల కాబోతున్న సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్‌లో వస్తున్న చిత్రమే ‘ది డీల్’. ఈ సినిమాకు హను కోట్ల దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా తానే హీరోగా కూడా నటించాడు. తనతో పాటు రవిప్రకాశ్, రఘు కుంచె వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇతర సినిమాలకు పోటీగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది ‘ది డీల్’. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇక సెన్సార్ కట్స్ విషయానికొస్తే.. టైటిల్ విషయంలో ‘ది డీల్’కు కత్తెర పడింది. బూతులు, మగవాళ్ల గురించి అభ్యంతరకరమైన డైలాగ్‌ను కూడా సెన్సార్ తొలగించింది.

The Deal Censor Certificate
The Deal Censor Certificate

ది వైల్డ్ రోబో

ఈవారం విడుదల కానున్న ఎన్నో చిన్న తెలుగు సినిమాల మధ్య ఒక ఇంగ్లీష్ యానిమేటెడ్ మూవీ కూడా విడుదల కానుంది. అదే ‘ది వైల్డ్ రోబో’. ఇదొక యానిమేటెడ్ సైఫై సినిమా. క్రిస్ శాండర్స్ దీనికి దర్శకత్వం వహించారు. ఇక ఈ వారం విడుదల కానున్న అన్ని సినిమాల్లో కేవలం ‘యూ’ సెర్టిఫికెట్ అందుకున్న సినిమా ‘ది వైల్డ్ రోబో’ మాత్రమే. ఈ సినిమాకు అసలు ఒక్క సెన్సార్ కట్ కూడా లేదు.

The Wild Robot Censor Certificate
The Wild Robot Censor Certificate

లవ్ రెడ్డి

ఈవారం విడుదల కానున్న ఎన్నో చిన్న సినిమాల్లో ‘లవ్ రెడ్డి’కి కాస్త హైప్ క్రియేట్ అయ్యింది. అర్జున్ రామచంద్ర, శ్రావణ రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. స్మరణ్ రెడ్డి దీనికి దర్శకుడిగా వ్యవహరించాడు. ఇప్పటికే మూవీలోని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెన్సార్ బోర్డ్.. ఈ సినిమాకు కూడా యూ/ఏ సర్టిఫికెటే ఇచ్చింది. మామూలుగా పల్లెటూరిలో వాడే బూతు పదాలను ‘లవ్ రెడ్డి’లో చేర్చాడు దర్శకుడు. ఆ బూతులను సెన్సార్ బోర్డ్ తొలగించింది. ఈ సినిమా కూడా అక్టోబర్ 18న విడుదల కానుంది.

Love Reddy Censor Certificate
Love Reddy Censor Certificate

1980లో రాధే కృష్ణ

ఒక డిఫరెంట్ టైటిల్‌తో ఈవారం ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రమే ‘1980లో రాధే కృష్ణ’. 1980ల్లో కృష్ణలంక అనే గ్రామంలో కులాలకు అతీతంగా పోరాడి అప్పటి కృష్ణ.. తన రాధను ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. ఇది కూడా ఒక రూరల్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో సైదులు, భ్రమరాంబిక హీరోహీరోయిన్లుగా నటించారు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కులాలకు అతీతంగా తెరకెక్కిన సినిమా కావడంతో జాతి, కులం లాంటి పదాలను మార్చమని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. టైటిల్ విషయంలో కూడా మార్పులు చెప్పింది.

1980 Lo Radhekrishna Censor Certificate
1980 Lo Radhekrishna Censor Certificate

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×