Mufasa Twitter Review: ఒకప్పుడు యానిమేషన్ చిత్రాలంటే కేవలం పిల్లలు చూసే సినిమాలు అని అనుకునేవారు. కానీ రోజులు మారిపోయాయి. యానిమేషన్‌లో కూడా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో తెరకెక్కే యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలా తాజాగా ఒక యానిమేషన్ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేసింది. అదే ‘ముఫాసా: ది లయన్ కింగ్’. నాలుగేళ్ల క్రితం విడుదలయిన ‘ది లయన్ కింగ్’ అనే సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. మరి ఇది ప్రేక్షకులకు నచ్చిందా? లేదా?
రంగంలోకి మహేశ్ బాబు
‘ది లయన్ కింగ్’ అనే సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే దానికి ప్రీక్వెల్ కూడా తెరకెక్కించాలని, అది పూర్తిగా ముఫాసా అనే క్యారెక్టర్‌పై ఆధారపడి ఉండాలని అప్పుడే మేకర్స్ నిర్ణయించారు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే సినిమా రాబోతుందని నాలుగేళ్ల క్రితమే ప్రకటించారు. ఇక ఈ మూవీకి ఇంగ్లీష్ ఆడియన్స్‌లో ఆటోమేటిక్‌గా హైప్ ఉంటుంది. దీనికి ఇతర భాషల్లో కూడా హైప్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ ఒక భారీ ప్లాన్ వేశారు. ఈ సినిమాలోని ముఖ్యమైన క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పడం కోసం ప్రతీ భాషలో స్టార్ నటీనటులను రంగంలోకి దించారు. అలా తెలుగులో మహేశ్ బాబు రంగంలోకి దిగారు.
Also Read: ‘ బచ్చలమల్లి ‘ ట్విట్టర్ రివ్యూ.. జనాల రియాక్షన్ ఏంటంటే?
డబ్బింగ్‌తో హైప్
‘ముఫాసా: ది లయన్ కింగ్’లో లీడ్ రోల్ అయిన ముఫాసా అనే క్యారెక్టర్‌కు మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు. అలా తెలుగులో ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా తెలుగులో ఈ సినిమాకు మహేశే స్వయంగా ప్రమోషన్స్ చేయడం విశేషం. అలా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు కూడా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను థియేటర్లలో చూడాలని ఫిక్స్ అయిపోయారు. తెలుగులో మాత్రమే కాదు.. అన్ని సౌత్ భాషల్లో కూడా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ మేకర్స్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలకు స్టార్ నటీనటులతో డబ్బింగ్ చెప్పించి దీనిపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు.
ఫస్ట్ పార్ట్ బాగుంది
డిసెంబర్ 20న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలామంది ప్రేక్షకులు ఈ యానిమేషన్ సినిమాను ఫస్ట్ డేనే చూడడానికి వెళ్లిపోయారు. వారంతా ట్విటర్‌లో రివ్యూ అందిస్తున్నారు. ఒక హిట్ సినిమాకు ప్రీక్వెల్ కావడంతో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ను చాలామంది ‘ది లయన్ కింగ్’తో పోలుస్తున్నారు. అలా ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కొందరు ప్రేక్షకులు ముఫాసా అంచనాలను రీచ్ అయ్యాడని చెప్తుంటే మరికొందరు మాత్రం ఈ సినిమా ఫస్ట్ పార్టే బాగుందని ఫీల్ అవుతున్నారు. మొత్తానికి వారి అభిప్రాయాలను, రివ్యూలను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. చాలావరకు ‘ముఫాసా: ది లయన్ కింగ్’కు పాజిటివ్ టాకే వస్తోంది.
Movie: Mufasa The Lion King
Rating: ⭐⭐⭐½
Review: CAPTIVATING
An engaging prequel is a tale of legacy and courage 🦁#Mufasa #MufasaTheLionKing #TheLionKing #MufasaTheLionKingReview #MufasaReview #SRK #HakunaMufasa #ShahRukhKhan@DisneyStudiosINhttps://t.co/CEqpuy3Gro— Cinetales (@cine_tales) December 19, 2024
🦁👑 Movie Review: Mufasa – The Lion King 👑🦁
A visually stunning but unoriginal reimagining of a Disney classic. While faithful to the original story, it prioritizes nostalgia over innovation.
_Rating:_ 3/5 ⭐️#Mufasa #Mufasareview #MufasaTheLionKing https://t.co/pwussqidUe pic.twitter.com/vZKHaIoGv3
— NK Channel (@itsnkupdates) December 19, 2024