Satyabhama Today Episode December 20 th : నిన్నటి ఎపిసోడ్ లో.. క్రిష్ కు ముద్దుల గురించి ఆశ పెట్టి చివరకు మాట తప్పి మోసం చేసింది సత్య.. క్రిష్ ఎలాగైనా నాలుగు స్నానానికి ఒప్పించాలని సత్య మాస్టర్ ప్లాన్ వేస్తుంది.. చల్లనీలతో స్నానం చేయిస్తూ వేడిగా ముద్దులు పెట్టాలని అనుకున్నాను కానీ ఈ కృష్ణయ్య ఎక్కడో మాయమైపోయాడని సత్య కావాలనే అంటుంది. సత్య మాటలు నమ్మి స్నానానికి వచ్చి కూర్చుంటాడు.. వీరిద్దరూ సరదాగా స్నానం చేయించుకోవడం చూసి మహదేవయ్య కోపంతో రగిలిపోతాడు. అటు జయమ్మ కూడా వీరిద్దరిని చూసి ముచ్చట పడిపోతుంది. మొగుడు పెళ్ళాల మధ్య నీకెందుకు అని క్రిష్ జయమ్మకు కౌంటర్ ఇస్తాడు. సత్య పై క్రిష్ కోపంగా ఉంటాడు. మాట ఇచ్చి తప్పుడు ఇదెక్కడిది అనేసి సత్య అని అడుగుతాడు. ఇచ్చిన మాట ప్రకారం క్రిష్ కి 44 ముద్దులు ఇస్తుంది. వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసి జయమ్మ సడన్ ఎంట్రీ ఇస్తుంది. సంధ్య సంజయ్ కు బర్త్ డే విషెస్ చెబుతుంది. డైరెక్ట్ గా చెప్పాలని అడుగుతాడు.. సంజయ్ మాత్రం ఎక్కడో కలిస్తే ప్రాబ్లం కానీ మీ అక్క ఇంట్లోనే కలిస్తే ప్రాబ్లం లేదు కదా నా మీద నీకు ప్రేమ ఉంటే నాకోసం నువ్వు తప్పకుండా మీ అక్క ఇంటికి వస్తావు అని ఫోన్ కట్ చేస్తాడు. సత్య క్రిష్ కోసం కొత్త డ్రెస్ కొని ఇస్తుంది. ఇది నాకిష్టమైన కలర్ నా సంపంగికి నా గురించి అన్ని తెలుసు అనేసి క్రిష్ సత్యను మెచ్చుకుంటాడు. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని నేను పాయసం తీసుకొని వస్తానని సత్య కిందికి వస్తుంది.. కిందకు సత్య రాగానే మహదేవయ్యా ఎదురుపడతాడు. చూస్తున్నాను మీరిద్దరూ ఏం చేస్తున్నారో ఎలా ఆడుకుంటున్నారో? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావని సంగతి నీ పిచ్చి మొగుడికి ఎప్పుడు చెప్తావ్ వాడికి చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడు చూడు ముందు ఆ పని చెయ్ తర్వాత నా మీద ఛాలెంజ్ లు వేయొచ్చు అనేసి మహదేవయ్య సత్య తో అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య పుట్టినరోజు కాబట్టి క్రిష్ కి నిజం చెప్పాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. తన తండ్రిపై ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్న విషయం క్రిష్ కి చెప్పాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక విధంగా అది అడ్డుపడుతుంది. చెప్పాలనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి క్రిష్ ని తీసుకెళ్లి పోతున్నారు. ఇక బెడ్ రూమ్ లో సత్య క్రిష్ కి నిజం చెప్పాలని అనుకుంటుంది కానీ అప్పుడే మహదేవయ్య పిలుస్తాడు. క్రిష్ ఒక ఐదు నిమిషాల్లో బాపు పిలుస్తున్నాడు మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్లిపోతాడు. ఆ దేవుడి దగ్గర సత్య మనసులో కోరికను చెప్తుంది. కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా క్రిష్ కనిపిస్తాడు. ఎవరితో అంతగానం ఏం కోరుకుంటున్నావు నీ బాధలు వింటాడా నీ కోరికలు తీరుస్తాడా అనేసి అడుగుతాడు. ఎవరికి హాని కలిగించేలా కోరుకోను కాబట్టి దేవుడు నా కోరికను తప్పకుండా తీరుస్తాడని సత్య అంటుంది.. నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను కదా అంటే అవును కదా మరి దేవుడి దగ్గర చెప్పు ఆ విషయం ఏంటో అనగానే దేవుడిని తలుచుకొని ఆ విషయం చెప్పబోతోంది. అంతలోకే భైరవి అక్కడకు వస్తుంది. పుట్టినరోజు నాడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలని లేదా చిన్న నీకు అనేసి అడుగుతుంది. అదేంటమ్మా అట్లన్నావ్ నీకోసం నీ గదికొస్తే నువ్వు గదిలో లేవు ఇప్పుడున్న కదరా మరి నీ ముందర నువ్వు ఆశీర్వాదం తీసుకో అనేసి అడుగుతుంది భైరవి. క్రిష్ ను భైరవి ఆశీర్వదించి బ్రేస్లైట్ ను గిఫ్ట్ గా ఇస్తుంది.
ఇదేంది నువ్వు ఎక్కడున్నావ్ క్రిష్ కోసం పాయసం చేస్తానన్నావు కదా మరి చేసేవంటే స్టవ్ మీద పెట్టాను అత్తయ్య అని సత్య వెళ్ళిపోతుంది. ఇక రేణుక వచ్చి చిన్న హ్యాపీ బర్త్డే అనేసి విషెస్ చెప్తుంది. అన్నయ్య కూడా ఉంటే మంచిది కదా అనేసి క్రిష్ అంటాడు. దానికి రేణుక దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు అనేసి వెళ్ళిపోతుంది. వెళ్లిన క్రిష్ కు నందిని ఫోన్ చేసి విషెస్ చెప్తుంది. సొంత చెల్లివి నా రక్తసంబంధానివి ఇలా నేను ఆ విష్ చేసేది ఒక గిఫ్ట్ లేదు ఒక అర్ధరాత్రి ఫోన్ చేసేది లేదు అనేసి క్రిష్ అనగానే నందిని షాక్ అవుతుంది. కొత్తగా ఈ కోరికలు ఏంటి బ్రో అనేసి అడుగుతుంది. సత్యా బల అన్నయ్యకి చేసిన దాన్ని చూస్తే నాకు కూడా అలా చేయాలని అనిపిస్తుంది నా చెల్లెలు కూడా నాకు అలా చేస్తే బాగుందని అనుకుంటున్నాను క్రిష్ అంటాడు. సరే మరి ఇంటికి వస్తున్నావుగా సాయంత్రం పార్టీ ఉంది అనగానే నేను రాను మీ బావ కూడా లేడు అని చెప్పగానే ఇదంతా నాకు తెలీదు నువ్వు వస్తున్నావ్ అని ఫోన్ పెట్టేస్తాడు.
అది విన్న సంధ్య ఈరోజు బావగారి పుట్టినరోజు కూడానా అయితే వదినని రెచ్చగొడితే ఆ ఇంటికి నేను వెళ్లొచ్చు ఎలాగైనా లైన్లో పెట్టాలి అనేసి సంధ్య నందిని దగ్గరికి వెళ్లి కాక పడుతుంది. చివరికి నందిని ఒప్పుకుంటుంది. దాన్ని పోలేను కదా అనగానే నువ్వేం భయపడక వదిన నేను వస్తాను నీతో అంటే నీ కంప్యూటర్ క్లాస్ మరి అనగానే ఈరోజు నీకోసం ఆ క్లాస్ ను వదిలేస్తాను అని సంధ్య అంటుంది. ఇక కృష్ణ గార్డెన్ లో ఆ విషయం చెప్పాలని సత్య ప్రయత్నం చేస్తుంది. అప్పుడు బామ్మ వచ్చి ఆశీర్వదిస్తుంది. సత్య ఎన్ని సార్లు చెప్పాలనుకున్నా చెప్పలేక పోతుంది. ఇక చెప్పడమే ఉండదు ఏదైతే అది అయింది రంగంలోకి దిగాలని సత్య ఫిక్స్ అవుతుంది. సత్య ఇంట్లో డెకరేషన్ పనులు చేసుకుంటుండగా.. సంధ్య ఆ అక్కడికి వస్తుంది.. బావ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పగానే వెనకాలే నందిని కూడా వస్తుంది. సంజయ్ నా బర్త్ డే కూడా నాకు విషయాలను లేదా మీకు అని అడిగి మరీ విషెస్ చెప్పించుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఎపిసోడ్లో మహదేవ సంజయ్ కు గిఫ్ట్ ఇస్తాడు. సత్య మీ కొడుకు సంజయ్ అని నాకు తెలుసు అని షాక్ ఇస్తుంది.. రేపటి ఎపిసోడ్ లో చక్రవర్తి క్రిష్ కి ఏ గిఫ్ట్ ఇస్తాడో చూడాలి..