Gundeninda GudiGantalu Today episode December 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజూ తో బార్ లో రాజేష్ తప్పుగా బిహేవ్ చేస్తాడు. కావాలనే గొడవ పెట్టుకుంటాడు. బాలు చూసి నా ఫ్రెండ్ ను కొడతావా అని కొడతాడు. బార్ లో పెద్ద రచ్చ చేస్తారు. సంజూ ను వదలకుండా కొడతాడు.. నేనెవ్వరో తెలుసా అని అంటాడు. కానీ బాలు మాత్రం నువ్వెవరైనా నాకేంటి అంటారు. కొట్టిన రాయికి పూజలు చేస్తూ పెద్ద హంగామా చేస్తాడు. ప్రభావతి, మీనాక్షిలు కలిసి రవి ఇంటికి వెళ్లారు. శోభా కూడా వస్తుంది. కానీ శృతి మాత్రం ఎవరితోను రాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంట్లో ప్రభావతి రవిని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. మొత్తానికి సత్యంను ఒప్పిస్తారు. సురేంద్ర తన ఇంటికి వచ్చి మాట్లాడుకునే విధానం తనకు నచ్చలేదని, అలాగే తను కావాలని జైలుకు పంపించాడని బాధపడతాడు సత్యం. ఈ సమయంలో తన ఆత్మ గౌరవాన్ని చంపుకొని, ఓ తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలో? రవిని తీసుకువచ్చి తన ఆత్మాభిమానాన్ని చంపుకోవాలో? తనకు అర్థం కావడం లేదని అంటాడు సత్యం. సురేంద్ర నన్ను ఎన్ని మాటలు అన్నాడు.. డబ్బులకోసం నా కూతురుకు వల విసురుతున్నా అని అన్నాడు. అతనే తన కూతురు, అల్లుడిని ఇంటికి పంపిస్తే నేను ఒప్పుకుంటాను అని అంటారు. పెళ్లిళ్ల పేరయ్య ఇంటికి వచ్చి మీ అమ్మాయి మౌనికకు గొప్పింటి సంబందాన్ని తీసుకొచ్చాను. మీరు కలలో కూడా ఊహించి ఉండరు అంత మంచి సంబంధం అనేసి అంటారు. నీలకంఠంగారని ఈ ఊర్లో చాలా పెద్దమనిషి ఆయనకు ఒక్కడే కొడుకు ఈ అమ్మాయిని ఎక్కడో చూసాడంట చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు.. మీరు పదండీ అని అనగానే ఇద్దరు వెళ్తారు. ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక సంజయ్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి పెళ్లిళ్ల పేరయ్య వచ్చాడు సంబంధం చూడమని చెప్పావా అనేసి అడుగుతుంది. ప్రతిరోజు వాళ్ళు సంజయ్ నన్ను ఘోరంగా అవమానించిన శృతి మీనా బాలు వీళ్ళందరికీ ఒకేసారి షాక్ ఇవ్వాలని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వీళ్ళందరికీ ఒక్కగానొక్క ఆడపడుచు అనేసి సంజయ్ అంటాడు. సంజయ్ కోసం నీలకంఠం సరే అంటాడు. ప్రభావతి, కామాక్షి ఇద్దరు నీలకంఠ మీ ఇంటికి వస్తారు.. ఇక నీలకంఠం వచ్చేసి మా అబ్బాయి మీ అమ్మాయిని చూశాడు అప్పటినుంచి పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మొండికేసి కూర్చున్నాడు అందుకే నేను ఈ సంబంధాన్ని మా స్థాయికి తగ్గకపోయినా ఒప్పుకున్నాను అనేసి అంటాడు. ఇక నీలకంఠం చూపిస్తున్న మర్యాదలకు ప్రభావతి ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. వెండి గ్లాసులో జ్యూస్ అందించేసరికి మరింత ఆశలు పెరుగుతాయి. తానే కోటీశ్వరాలుగా ఫీల్ అవుతుంది ప్రభావతి. సంబంధం గురించి ఏం చెప్పడం లేదు. మా సంబంధం నచ్చిందా? లేదా? అని నీలకంఠం ప్రశ్నిస్తాడు. వాస్తవానికి నీలకంఠం ఏం అడిగాడో కూడా పట్టించుకోకుండా ఊహాల్లోనే తెలిపోతుంది. ఇక కామాక్షి వచ్చి వదిన అని అడుగుతుంది. అదే అండి వెండి గ్లాసులలో చూసి షాక్ అవుతుంది. ఇంత ఆస్తి ఉన్న మీరు కట్నం ఎంత అడుగుతారో అని ఆలోచిస్తుంది అనగానే అతను అస్సలు వద్దు అని చెబుతాడు.
ఇక తాను వచ్చేటప్పుడూ తన భర్త ఇంట్లో లేరని, తన కుటుంబ సభ్యులతో మాట్లాడి కబురు పంపిస్తారని చెబుతోంది. దీంతో రేపే తాను పెళ్లి చూపులకు వస్తామంటూ చెబుతారు నీలకంఠం.. ఇంటికి వెళ్తామనీ అనగానే.. పట్టుచీర పెట్టి మర్యాద చేస్తారు. దీంతో ప్రభావతి ఉబ్బితబ్బిబవుతుంది. పైగా కారులో ఇంటిదగ్గర దించరమ్మని నీలకంఠం తన డ్రైవర్ కు చెప్తాడు. ఇలా ప్రభావతి రిచ్ కారులో ఇంటిముందు దిగగానే అందరూ షాక్ అవుతారు. మహారాణిలా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ.. తన కూతురు మౌనికను పొగడ్తలతో ముంచేస్తుంది. మౌనికాకు గొప్పింటి సంబంధం సెట్ అయిందని, అబ్బాయి పద్ధతి గల వాడని చెబుతోంది. తల్లిదండ్రులను ఒప్పించి, మనకు పెళ్లిళ్ల పేరయ్య ద్వారా సమాచారం పంపించారని చెబుతుంది ప్రభావతి. అక్కడ జరిగిన రాజా మర్యాదల గురించి ప్రభావతి రేంజ్ లో చెబుతుంది.. ఇక ఇంట్లో అందరికి ప్రభావతి గొప్పగా చెబుతుంది..
ఇక్కడ అన్ని బాగున్నాయి. కానీ, అదే రేంజ్ లో కట్నం అడుగుతారు కదా.. అంటూ సత్యం అంటాడు. వారు తమకు కానీ కట్నం కూడా ఇవ్వద్దంటూ చెప్పారని, కేవలం తమ కూతుర్ని ఇంటికి పంపిస్తే.. చాలని చాలా క్లియర్ గా చెప్పారని ప్రభావతి చెబుతుంది. దీంతో మీనా కూడా వాళ్ళు చాలా పద్ధతిగా మనుషులని, ఈ సంబంధం ఓకే అయితే మౌనికాకు జీవితమే మారిపోతుందంటూ మీనా కూడా అంటుంది. కానీ, బాలు మాత్రం ఏదో సందేహిస్తాడు. అంత కోటీశ్వరులు మన ఇంటికి వచ్చి సంబంధం సెట్ చేసుకోవడం ఏంటి అని అందరు అనుమాన పడతారు. ఇక ప్రభావతి మాత్రం అందరిని ఒప్పిస్తుంది. మౌనిక, మనోజ్ లను ఎంతో పద్దతిగా పెంచాననీ, మనోజ్ కు గొప్పింటి సంబంధం చేశానని, అలాగే మౌనిక కూడా కోటీశ్వరులకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రభావతి రేంజ్ లో చెబుతోంది. దీంతో బాలు వెంటనే రియాక్ట్ అయి.. గొప్పింటి సంబంధమని మనోజ్ గాడికి పెళ్లి చేశావు? ఎంతవరకు రోహిణి వాళ్ళ నాన్న ముఖం కూడా ఎవరు చూడలేదు కాదా కుండబద్దలు కొడతాడు.. ఇక ప్రభావతి పెళ్లికి అందరూ వస్తారు కదా వాళ్ళ నాన్న కూడా పిలుద్దాం వాళ్ళ నాన్న కూడా వస్తారు కదా అనేసి అంటుంది. ఇక మౌనికను అందరూ అడుగుతారు నీకు సంబంధం నచ్చిందా అనగానే మీ ఇష్టమే నా ఇష్టం అని సిగ్గుపడుతుంది. అది చూసిన మీనా రోహిణి మౌనిక సిగ్గుపడడం చాలా బాగుంది ఇదే మొదటిసారి అనేసి ఆట పట్టిస్తారు. ఇక కామాక్షికి పెళ్లిళ్ల పేరయ్యకు చెప్పి రేపు వాళ్ళని రమ్మని చెప్పమని చెప్తుంది ప్రభావతి. కామాక్షి వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. బార్ లో నిన్ను ఆ బాలు నిన్ను కొట్టాడు కదా మరి వాడి ఇంట్లో ఉండగా ఈ సంబంధం ఓకే అవుతుందా అనగానే దానికి సంజయ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉందని తన మనిషి ఫోన్ నుంచి ఫోన్ చేసి కార్ బుక్ చేసుకోవాలని అడుగుతాడు. ఉంటే ఈ సంబంధం ఎక్కడ చెడిపోతుందని ప్రభావతి టెన్షన్ పడుతూ ఒప్పేసుకోమని చెప్తుంది. బాలు ఒప్పేసుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు సడన్గా ఎంట్రీ ఇస్తాడు.. ఏం జరుగుతుందో రేపు చూడాలి…